CM Jagan : నూతన విద్యా విధానం వల్ల ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

|

Jun 17, 2021 | 7:54 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తోన్న నూతన విద్యా విధానం వల్ల ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు...

CM Jagan : నూతన విద్యా విధానం వల్ల ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
Cm Jagan And Adimulapu
Follow us on

New education policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తోన్న నూతన విద్యా విధానం వల్ల ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ సరికొత్త సిస్టమ్ వల్ల ఉపాధ్యాయులు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందన్నారు. ఉపాధ్యాయుల్లో, ఇతర భాగస్వాముల్లో దీని గురించి అవగాహన, చైతన్యం కలిగించాలని సీఎం విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించారు. ఇవాళ తాడేపల్లిలో విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన విద్యావిధానంవల్ల జరిగే మేలును టీచర్లకు, విద్యార్థులకు వాళ్ల తల్లిదండ్రులకు వివరించాలని సీఎం ఆదేశించారు. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలని స్పష్టంచేశారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు – నేడు కింద భూమి కొనుగోలు చేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించండి అని సీఎం అధికారులకు ఆదేశించారు.

ఉపాధ్యాయుడు, విద్యార్థి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశమని సీఎం అన్నారు. ఎన్‌ఈపీ(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌) ప్రకారం.. నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పన మన లక్ష్యమన్న సీఎం. . ఆ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలని సూచించారు. “మనం చేస్తున్న పనులన్నీ కూడా తలెత్తుకుని చేస్తున్న పనులు. తలదించుకుని చేస్తున్న పనులు కావు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉపాధ్యాయులుకు మంచి జరుగుతుందని చెప్పండి. పిల్లలకు కూడా మంచి జరుగుతుందని వివరించండి.” అని సీఎం స్పష్టం చేశారు.

అంగన్‌వాడీలు కూడా నాడు–నేడులో భాగమని చెప్పిన సీఎం జగన్.. దీనికి కూడా ఒక యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించండని సూచించారు. “2 సంవత్సరాలలోపు అనుకున్న కాన్సెప్ట్‌ పూర్తి కావాలి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సమూల మార్పు తీసుకొస్తున్నాం. ఐదేళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూడు రంగాల్లో మనం చేసిన ప్రగతి కనిపించాలి. సాచ్యురేషన్‌ పద్ధతిలో అంగన్‌వాడీలు. 55వేల అంగన్‌వాడీల్లో మనం ఎక్కడా తగ్గించడం లేదు. ఫౌండేషన్‌ స్కూల్‌ కాన్సెఫ్ట్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందరూ ఇదే ఫాలో అవ్వాలి. 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులు ఒక ఎస్‌జీటీ టీచర్‌ డీల్‌ చేయలేరు. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ అవసరం.” అని జగన్ దిశానిర్దేశం చేశారు.

ఆట స్థలంలేని స్కూళ్లకు నాడు – నేడు కింద భూమిని కొనుగోలు చేయాలన్న ముఖ్యమంత్రి.. వచ్చే ఏడాది ప్రస్తుతం విద్యాకానుకలో ఇస్తున్న దానికంటే అదనంగా స్పోర్ట్స్‌ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని పరిశీలించిండని సూచించారు. “దీని కోసం ప్రణాళిక వేసుకోవాలి. అలాగే పాఠశాలల్లో ప్రయోగశాలలు, లైబ్రరీలు బలోపేతం చేసుకోవాలి. పాఠశాల లైబ్రరీల్లో మంచి ఇంటర్నెట్‌ సదుపాయం అందించాలి” అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.

Read also : Business dull : బిజినెస్ లేక, పెట్టుబడికి వడ్డీలు.. షాపు అద్దెలు.. వర్కర్లకు జీతాలు ఇవ్వలేక, దిక్కుతోచని స్థితిలో వస్త్ర వ్యాపారస్తులు..!