AP Crops : ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది : వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటించాలని నిర్ణయించామని..

AP Crops : ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది : వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
kannababu
Follow us

|

Updated on: Jun 08, 2021 | 9:33 PM

Kannababu : ఆంధ్రప్రదేశ్‌లో బత్తాయి, నిమ్మ పంటల సాగు.. దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటించాలని నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. నిమ్మ, బత్తాయి అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళికలు చేసేలా సీఎం వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారని మంత్రి తెలిపారు. రైతులకు రెట్టింపు ఆదాయం, గ్రామాల్లో ఉపాధి, వారి జీవన ప్రమాణ స్థాయి పెరిగేలా సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. మంగళవారం ఆయన వైయ‌స్సార్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు.

పలువురు ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, నిమ్మ, బత్తాయి సాగు రైతులతో మంత్రి కన్నబాబు మాట్లాడారు. నాణ్యమైన మొక్కలు, అంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికార్లకు సూచించారు. ఆర్‌బీకేల ద్వారా నిమ్మ, బత్తాయి సాగు శిక్షణ, సమగ్ర యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సిట్రస్‌ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని కన్నబాబు పేర్కొన్నారు.

Read also : Lockdown : గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు.. అక్కడ మాత్రం మామూలే..! కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివీ..