Weather Alert: ఎండాకాలం వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. ఇదిగో 3 రోజల వెదర్ రిపోర్ట్..
పగటి పూట ఎండలు.. సాయంత్రం అయితే వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో.. ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు సైతం కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై .. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

పగటి పూట ఎండలు.. సాయంత్రం అయితే వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో.. ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు సైతం కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై .. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఒక ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడింది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :-
బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ :-
బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.
గమనిక:- కోస్తా ఆంధ్ర ప్రదేశ్ – యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఛత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. నిన్న గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు చత్తీస్గడ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి, తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.
వీటి ప్రభావంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి, రెండు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రానున్న మూడు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
ఈరోజు రాష్ట్రంలోని ఒకటి, రెండు జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
