AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET 2026 Registration: యూజీసీ నెట్‌ జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు షురూ.. రాత పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే

యూజీసీ నెట్‌ జూన్ సెషన్ 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 85 సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు పరీక్షకు సంబంధిన పూర్తి షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. యేటా ఈ పరీక్షను రెండు

UGC NET 2026 Registration: యూజీసీ నెట్‌ జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు షురూ.. రాత పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే
UGC NET June Notification
Srilakshmi C
|

Updated on: May 01, 2026 | 6:00 AM

Share

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2026 (యూజీసీ నెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 85 సబ్జెక్టులకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు పరీక్షకు సంబంధిన పూర్తి షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఆన్‌లైన్‌ విధానంలో మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. యేటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా, హ్యూమన్‌రైట్స్‌ అండ్‌ డ్యూటిస్‌, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, పొలిటికల్ సైన్స్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఉమెన్‌ స్టడీస్‌, డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఆయుర్వేద బయాలజీ తదితర సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహించారు. కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ- ఎన్‌సీఎల్‌, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 50 శాతం మార్కులున్నా సరిపోతుంది. అభ్యర్ధుల వయోపరిమితి జేఆర్‌ఎఫ్‌కు జూన్‌ 1, 2026 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఎలాంటి వయోపరిమితి లేదు.

యూజీసీ నెట్‌ 2026 (జూన్‌) ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 20, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.1150, జనరల్- ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌ అభ్యర్ధులు రూ.325 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు… 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు… 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 20, 2026.
  • పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: మే 20, 2026.
  • దరఖాస్తు సవరణ తేదీలు: మే 22 నుంచి 24 వరకు.
  • ఆన్‌లైన్‌ రాత పరీక్షలు: జూన్‌ 22, 2026 నుంచి జూన్‌ 30, 2026.
  • అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: తర్వాత వెల్లడి
  • ఫలితాల తేదీ: తర్వాత వెల్లడి

యూజీసీ నెట్‌ 2026 (జూన్‌) ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!
ట్రైథ్లాన్ ఈవెంట్‌లో తొలి గోల్డ్ పట్టేసిన ఆతిథ్య దేశం..!
రేకుల షెడ్డులో వేడితో తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే కూల్ కూల్
రేకుల షెడ్డులో వేడితో తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే కూల్ కూల్
యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం
యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం
పెట్రోల్ బంక్‌లో ఈ నంబర్ గమనించారా? మైలేజీకి దీనికి సంబంధం ఏమిటి?
పెట్రోల్ బంక్‌లో ఈ నంబర్ గమనించారా? మైలేజీకి దీనికి సంబంధం ఏమిటి?
నటుడు సౌరవ్ గుజ్జర్ పై కేసు నమోదు..
నటుడు సౌరవ్ గుజ్జర్ పై కేసు నమోదు..
లడ్డూ కాదు.. రూ.2.21 లక్షలు పలికిన విఘ్నేశ్వరుడి ప్రతిమ!
లడ్డూ కాదు.. రూ.2.21 లక్షలు పలికిన విఘ్నేశ్వరుడి ప్రతిమ!
ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా.. ధనుష్ సైతం ఫిదా..
ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా.. ధనుష్ సైతం ఫిదా..