AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teacher Movie : ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్.. సరికొత్త పాత్రలో సిమ్రాన్

ఓ వైపు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంటే.. మరో వైపు చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి. కొత్త కొత్త దర్శకులు విభిన్నమైన కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర సినిమా రానుంది.

Teacher Movie : ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్.. సరికొత్త పాత్రలో సిమ్రాన్
Teacher Movie
Rajeev Rayala
|

Updated on: May 01, 2026 | 8:43 AM

Share

కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్‌లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిత్రాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీస్ చాలా ఉన్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద హీరోలు, దర్శకులు కూడా కొత్త కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఆసక్తి  చిత్రం తెరకెక్కుతుంది.. ఆ సినిమా పేరే టీచర్. ఆసక్తికర కథతో టీచర్ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామల్లో సిమ్రాన్ ఒకరు. ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసిన సిమ్రాన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి పేక్షకులను అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలను చేస్తున్న సిమ్రాన్ ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో రానున్నారు. సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ టీచర్. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. బాలు శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్, సూపర్ టాకీస్ బ్యానర్లపై కాశీ విశ్వనాథన్, సమీర్ భరత్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకులను మెప్పించింది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

ఈ చిత్రంలో సిమ్రాన్ టీచర్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ క్రేజీ మూవీలో హిస్టరీ లెసన్స్ కాస్త ‘డార్క్’గా ఉండబోతున్నాయని అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. త్వరలోనే  రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా టైటిల్ లోగో  ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తించింది. లోగోలో చాక్‌పీస్‌తో పాటు గన్ ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే కథ అలాగే యాక్షన్ సీన్స్‌తో పాటు సైకలాజికల్ డ్రామా ఈ చిత్రంలో ఉండనున్నాయని తెలుస్తుంది. త్వరలోనే సినిమాకు సంబందించిన క్రేజీ అప్డేట్స్ విడుదల చేయనున్నారు. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

View this post on Instagram

A post shared by SIMRAN (@simranrishibagga)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us