కేసు నమోదు.. అఙ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్

అధికారులను దుర్భాషలాడినందుకు గానూ టీడీపీ నేత, ఏపీ మాజీ విప్ కూన రవికుమార్‌పై ఆముదాలవలసలో కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 11మంది వ్యక్తులపైన సెక్షన్‌ 353, 427, 506, 143, ఆర్‌డబ్ల్యూ 149, సెక్షన్‌ (3) పీడీపీపీ యాక్ట్‌ 1984కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆ విషయం తెలుసుకున్న రవికుమార్.. ఆయన 11 మంది అనుచరులు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు రవికుమా […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:10 am, Wed, 28 August 19
కేసు నమోదు.. అఙ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్

అధికారులను దుర్భాషలాడినందుకు గానూ టీడీపీ నేత, ఏపీ మాజీ విప్ కూన రవికుమార్‌పై ఆముదాలవలసలో కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 11మంది వ్యక్తులపైన సెక్షన్‌ 353, 427, 506, 143, ఆర్‌డబ్ల్యూ 149, సెక్షన్‌ (3) పీడీపీపీ యాక్ట్‌ 1984కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆ విషయం తెలుసుకున్న రవికుమార్.. ఆయన 11 మంది అనుచరులు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు రవికుమా ర్‌ ముందస్తు బెయిల్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మిగిలిన వ్యక్తుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండల కేంద్రంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కూన రవి కుమార్, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. అధికారులపై దుర్భాషలాడుతూ రౌడీయిజం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.