ఏపీ భవన్‌లో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డు తీసేశారు..!

ఢిల్లీలోని ఏపీ భవన్‌‌లో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్‌ అమరావతి’ బోర్డును అధికారులు తొలగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిగా ప్రకటించి..నిర్మాణాలను ప్రారంభించింది. అప్పుడు ఏపీ భవన్‌లో ‘ఐ లవ్‌ అమరావతి’  ఏర్పాటు చేశారు. గతేడాది సంక్రాంతి సమయంలో కూడా లక్షలు ఖర్చుపెట్టి మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగులను ఏర్పాటు చేశారు. ప్రజంట్ సీన్ పూర్తిగా రివర్సయ్యింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ఘోరపరాజయంలోకి నెట్టి.. […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:31 pm, Sun, 26 January 20
ఏపీ భవన్‌లో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డు తీసేశారు..!

ఢిల్లీలోని ఏపీ భవన్‌‌లో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్‌ అమరావతి’ బోర్డును అధికారులు తొలగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిగా ప్రకటించి..నిర్మాణాలను ప్రారంభించింది. అప్పుడు ఏపీ భవన్‌లో ‘ఐ లవ్‌ అమరావతి’  ఏర్పాటు చేశారు. గతేడాది సంక్రాంతి సమయంలో కూడా లక్షలు ఖర్చుపెట్టి మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగులను ఏర్పాటు చేశారు. ప్రజంట్ సీన్ పూర్తిగా రివర్సయ్యింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ఘోరపరాజయంలోకి నెట్టి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు.

సదరు బిల్లు శాసనసభ ఆమోదం కూడా పొందింది. ఈ నేపథ్యంలో..ఏపీ భవన్‌ ప్రస్తుత రెసిడెంట్‌ కమిషనర్‌ భావన సక్సేనా ఆదేశాల మేరకు.. సిబ్బంది ‘ఐ లవ్‌ అమరావతి’ బోర్డును తొలగించారు. గతంలో ఏపీ భవన్‌‌కు వెళ్లినవారంతా ఈ బోర్డు వద్ద నిల్చుని సెల్ఫీలు దిగేవారు. బోర్డు తొలగింపుపై అధికారుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కోతుల బెడద కారణంగా తీశేశామని కొందరు చెప్తున్నారు. దీనికి ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంటోంది.