ప్రజావేదిక కూల్చివేత సక్రమమే – పవన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక ఈ చర్య.. ప్రతిపక్ష టీడీపీపై కక్ష సాధింపు చర్యేనంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజావేదిక కూల్చివేతపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రజావేదిక అక్రమ కట్టడమేనని.. ఇలాంటి అక్రమ కట్టడాల కూల్చివేతను కొనసాగించాల్సిందేనని అన్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మిగిలిన భవనాలను కూడా కూల్చివేయాలని […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక ఈ చర్య.. ప్రతిపక్ష టీడీపీపై కక్ష సాధింపు చర్యేనంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజావేదిక కూల్చివేతపై స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రజావేదిక అక్రమ కట్టడమేనని.. ఇలాంటి అక్రమ కట్టడాల కూల్చివేతను కొనసాగించాల్సిందేనని అన్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మిగిలిన భవనాలను కూడా కూల్చివేయాలని వ్యాఖ్యానించారు. అలా చేస్తేనే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచుతారని పవన్ పేర్కొన్నారు.