ఇకపై ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా సమస్య పరిష్కారమవుతోందో లేదో తెలిపాలని.. ఒకవేళ పరిష్కారం అవుతుందంటే ఆ ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో రశీదు కూడా ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఇక త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తానని జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా తాను కూడా సమస్యలను పరిశీలిస్తానని పేర్కొన్నారు. అధికారులు అకస్మాత్తుగా వారానికో రోజు ఏదో ఓ చోట రాత్రి బస చేసి తనిఖీలు చేస్తుండాలని ఆయన వివరించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వినాలని సీఎం జగన్ సూచించారు.