బ్రేకింగ్: అయేషా మీరా హత్య కేసు.. వెలుగులోకి మరో నిజం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో కొత్త నిజం వెలుగులోకి వచ్చింది. ఆమె తల ఎముకలో గాయమున్నట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తాజా నివేదికలో బయటపడింది. అయేషా మీరా కేసును సీబీఐ విచారిస్తుండగా.. ఇటీవల మరోసారి ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎఫ్ఎస్ఎల్ తమ నివేదికను సీబీఐకు అందజేసింది. ఇక ఈ నివేదికలో చనిపోయింది అమ్మాయి అని, అప్పుడు ఆమె వయస్సు 19సంవత్సరాలని తేల్చారు. తల […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో కొత్త నిజం వెలుగులోకి వచ్చింది. ఆమె తల ఎముకలో గాయమున్నట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తాజా నివేదికలో బయటపడింది. అయేషా మీరా కేసును సీబీఐ విచారిస్తుండగా.. ఇటీవల మరోసారి ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎఫ్ఎస్ఎల్ తమ నివేదికను సీబీఐకు అందజేసింది. ఇక ఈ నివేదికలో చనిపోయింది అమ్మాయి అని, అప్పుడు ఆమె వయస్సు 19సంవత్సరాలని తేల్చారు. తల భాగంలోని ఉన్న ఎముక ఫ్యాక్చర్ అయినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఎముకలో ఉన్న షార్ప్ ఏడ్జ్‌లో బలంగా గాయం అయినట్టు ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది.
కాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అయేషా మీరా ఇబ్రహీంపట్నంలోని ఓ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతూ, ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉండేది. ఈ క్రమంలో 2007 డిసెంబర్‌లో ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసులో కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఈ కేసులో సత్యం బాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు పదేళ్ల తరువాత అతడు నిర్దోషి అని తేలడంతో.. సత్యం బాబు జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక ఆ తరువాత ఈ కేసును తిరిగి సీబీఐకు అప్పగించిన విషయం తెలిసిందే.