పవన్‌కు షాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు..!
కర్నూల్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు షాక్ తగిలింది. ఆయన పర్యటన ప్రారంభం కాకముందే నిరసన సెగలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల జేఏసీ నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా పవన్ మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోవైపు పవన్, కర్నూల్‌కు చేరుకున్నారు. సుగాలి ప్రీతి కేసులో నిందితులకు […]
కర్నూల్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు షాక్ తగిలింది. ఆయన పర్యటన ప్రారంభం కాకముందే నిరసన సెగలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల జేఏసీ నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా పవన్ మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోవైపు పవన్, కర్నూల్‌కు చేరుకున్నారు. సుగాలి ప్రీతి కేసులో నిందితులకు శిక్ష పడాలంటూ చేస్తోన్న ర్యాలీలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులు, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు భారీ సంఖ్యలో పాల్గొనబోతున్నారు. రెండు రోజుల పాటు ఆయన కర్నూల్‌లో పర్యటించనున్నారు.