టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అమరావతిలో 500 ఎకరాల భూమిని కొన్నారంటూ వైసీపీ నేతల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ‘వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు ఇంకా మారలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ నేతలు అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారని… ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారని లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
‘తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య’ అని లోకేష్ ట్వీట్ చేశారు.అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు చేయడం కాదని.. దమ్ముంటే నిరూపించండంటూ లోకేష్ సవాల్ చేశారు.
వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారు. pic.twitter.com/sziD0inmXs
— Lokesh Nara (@naralokesh) July 28, 2019
తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య.
— Lokesh Nara (@naralokesh) July 28, 2019
అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించండి. లేక రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి.
— Lokesh Nara (@naralokesh) July 28, 2019