AP Projects: డబుల్ ఇంజిన్ సర్కారులో డబ్బుల వరద.. ఇక ఏపీ ప్రాజెక్టులకు గ్రహణం వీడినట్లే..!

విభజన జరిగి పదేళ్లు పూర్తయిపోయింది. కానీ ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేదు. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కీలక ప్రాజెక్టు ఒకటీ లేదు. అసలు రాజధాని లేకపోతే మిగతా రాష్ట్రం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క విశాఖ నగరం అంతంత మాత్రం తప్పితే మిగతా ఎక్కడా సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. అంతెందుకు రాజధాని అమరావతి లోనే ఇటీవల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సదస్సు నిర్వహించాలంటే సరైన కన్వెన్షన్ హాల్ లేకుండా పోయింది.

AP Projects: డబుల్ ఇంజిన్ సర్కారులో డబ్బుల వరద.. ఇక ఏపీ ప్రాజెక్టులకు గ్రహణం వీడినట్లే..!
AP CM Chandrababu Naidu, PM Modi

Edited By: Janardhan Veluru

Updated on: Aug 30, 2024 | 4:56 PM

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమరోత్సహంతో ముందుకు వెళ్తోంది. కేంద్రం సరైన సమయంలో సహకారం అందిస్తూ ఉండడం తో కీలక ప్రాజెక్టు లు పట్టాలెక్కుతున్నాయి. అమరావతి కి 15 వేల కోట్లు, పోలవరం కు 12 వేల కోట్లు, కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మౌలిక సదుపాయాల కల్పన కు 2400 కోట్లు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట 5000 కోట్లు, 15 వ ఆర్థిక సంఘం నిధులు 1450 కోట్లు, విశాఖ, విజయవాడ లలో మెట్రో లకు 40 వేల కోట్ల కు అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం ప్రోత్సాహం… లాంటి ప్రాజెక్టులతో నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. క్షణం ఆలస్యం చేయకుండా కార్యాచరణ కు దిగుతోంది. సరిగ్గా నేటినుంచి నాలుగేళ్లు టార్గెట్ గా పెట్టుకుని దశలవారీగా పనులు పూర్తి చేయాలన్న తలంపుతో ముందుకు వెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సరికొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది ఏపీ సర్కారు. విభజన జరిగి పదేళ్లు పూర్తయిపోయింది. కానీ ఇప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేదు. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కీలక ప్రాజెక్టు ఒకటీ లేదు. అసలు రాజధాని లేకపోతే మిగతా రాష్ట్రం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క విశాఖ నగరం అంతంత మాత్రం తప్పితే మిగతా ఎక్కడా సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. అంతెందుకు రాజధాని అమరావతి లోనే ఇటీవల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సదస్సు నిర్వహించాలంటే సరైన కన్వెన్షన్ హాల్ లేకుండా పోయింది. దాంతో...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి