టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు.. ఫైనల్ లిస్ట్ ఇదే..!
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా విడుదలైంది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. కర్ణాటక నుంచి ముగ్గురికి, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఒక్కోక్కరికీ అవకాశం కల్పించారు. మొత్తం 28 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి వి. ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్, […]
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా విడుదలైంది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. కర్ణాటక నుంచి ముగ్గురికి, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఒక్కోక్కరికీ అవకాశం కల్పించారు. మొత్తం 28 మందితో టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి వి. ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్, పార్థసారథి. తెలంగాణ నుంచి జె.రామేశ్వరరావు, బి.పార్థసారథి రెడ్డి, వెంకట భాస్కర్‌రావు, మూరంశెట్టి రాములు, డి.దామోదర్ రావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్ రెడ్డి. తమిళనాడు నుంచి కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్. శ్రీనివాసన్, డా.నిచ్చిత ముత్తవరపు, కుమారగురు. ఇక కర్ణాటక నుంచి రమేష్‌శెట్టి, సంపత్, రవినారాయణ్, సుధానానాయణమూర్తి. ఢిల్లీ నుంచి శివశంకర్, మహారాష్ట్ర నుంచి రాజేష్ శర్మలు బోర్డు సభ్యులుగా ఖరారయ్యారు. గత ప్రభుత్వంలో 18 మందితో పాలకమండలి ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్యను 28 కి పెంచారు.