దీక్ష వేళ.. బాబుకు భారీ షాక్..వైసీపీలోకి యువనేత..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడి మరో పార్టీ కండువాను కప్పుకున్నారు. అయితే ఆ వలసలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఇప్పటికీ కొంతమంది టీడీపీ లీడర్లు వేరే పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్.. టీడీపీని వీడేందుకు […]

దీక్ష వేళ.. బాబుకు భారీ షాక్..వైసీపీలోకి యువనేత..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 14, 2019 | 11:53 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడి మరో పార్టీ కండువాను కప్పుకున్నారు. అయితే ఆ వలసలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఇప్పటికీ కొంతమంది టీడీపీ లీడర్లు వేరే పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్.. టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. బుధవారం అనుచరులు, అభిమానులతో చర్చించిన అవినాష్.. పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 4గంటలకు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువాను కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కాగా తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని భావిస్తోన్న అవినాష్.. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఏ పార్టీలోకి వెళితే బావుంటుంది అన్న దానిపై తన అభిమానులు, అనుచరులతో చర్చించారు. వారిలో ఎక్కువశాతం వైసీపీకే ఓటేయడంతో అవినాష్.. ఆ పార్టీ కండువాను కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వకముందు దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్.. కొద్ది రోజులు వైసీపీలో కొనసాగిన విషయం తెలిసిందే.