AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. ఏం చర్చించారంటే?

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో వరుగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సీఎం భేటీ అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బ్యాడ్మింటన్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలో క్రీడా శిక్షణ కేంద్రాల ఏర్పాటు ఉన్న అవకాశాలను సీఎం కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

CM Chandrababu: కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. ఏం చర్చించారంటే?
Cm Chandrababu
Anand T
|

Updated on: Jul 16, 2025 | 3:26 PM

Share

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఇందులో భాగంగా బుధవారం సీఎం చంద్రబాబు కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటి అయ్యారు.. ఏపిలో ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ,క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు,నేషనల్ వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి, స్టేడియమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణాలకు సంబంధించి విజ్ఞాపనలు అందజేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరారు చంద్రబాబు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని, కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం కేంద్రమంత్రికి వివరించారు. ఏపిలో క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల్ని కేంద్రమంత్రికి అందేశారు

నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటు, తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ. 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ. 170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ. 341 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు. జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు. రాయలసీమలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని ,2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు కేంద్రమంత్రికి చంద్రబాబు వివరించారు

ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ధన్యవాదాలు తెలిపారు విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని చంద్రబాబు కేంద్రమంత్రికి తెలిపారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. చంద్రబాబు వినతి పట్ల కేంద్రమంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.