AP Cabinet Decisions: ముగిసిన భేటి.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

| Edited By: Phani CH

Oct 28, 2021 | 2:16 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయింది. ఈ భేటిలో..

AP Cabinet Decisions: ముగిసిన భేటి.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
Ap Cabinet
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయింది. ఈ భేటిలో పలు కీలక అంశాలపై కేబినేట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించాలని కేబినేట్ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆమోదం తెలిపింది. అలాగే విశాఖలోని మధురవాడలో 130 ఎకరాలను ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌కు కేటాయించడానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.

అటు శారదా పీఠానికి కూడా మధురవాడలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ-డబ్ల్యూఎస్‌కు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడానికి, అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశాన్ని కేబినెట్ ఆమోదించింది. ప్రకాశం జిల్లా వాడ్రేవు సహా 5 ఫిషింగ్ హార్బర్ల్ డీపీఆర్‌లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం త్రైపాక్షిక ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలపగా.. అటు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు వీలుగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి అంగీకారం తెలిపింది.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!

Garuda Puranam: ఈ 3 అలవాట్లు వెంటనే మానేయాలి.. లేదంటే కష్టాలు తప్పవు.!