సాదాసీదాగా వైసీపీ మహిళా ఎంపీ వివాహం.. రెసెప్షన్‌కు సీఎం జగన్

సాదాసీదాగా వైసీపీ మహిళా ఎంపీ వివాహం.. రెసెప్షన్‌కు సీఎం జగన్

వైసీపీ మహిళా ఎంపీ.. వివాహ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ఒక సాధారణ అమ్మాయిలా వివాహం చేసుకున్నారు. ఇంతకీ పెళ్లి చేసుకున్న ఆ ఎంపీ ఎవరు అనుకుంటున్నారా..? అతిచిన్న వయస్సులోనే పార్లమెంట్‌కు ఎన్నికై రికార్డు సృష్టించిన అరకు ఎంపీ గొట్టేటి మాధవి. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ జిల్లాలోని ఆమె స్వగ్రామం చెరబన్నపాలెంలో కళ్యాణం జరిగింది. ఆమె చిన్ననాటి స్నేహితుడు సెయింట్ అరెజా కాలేజ్ కరస్పాండెంట్ కుసిరెడ్డి శివప్రసాదరెడ్డిని ఆమె పెళ్లి చేసుకున్నారు. వైసీపీ అధికారులు, […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 18, 2019 | 1:05 PM

వైసీపీ మహిళా ఎంపీ.. వివాహ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ఒక సాధారణ అమ్మాయిలా వివాహం చేసుకున్నారు. ఇంతకీ పెళ్లి చేసుకున్న ఆ ఎంపీ ఎవరు అనుకుంటున్నారా..? అతిచిన్న వయస్సులోనే పార్లమెంట్‌కు ఎన్నికై రికార్డు సృష్టించిన అరకు ఎంపీ గొట్టేటి మాధవి. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ జిల్లాలోని ఆమె స్వగ్రామం చెరబన్నపాలెంలో కళ్యాణం జరిగింది. ఆమె చిన్ననాటి స్నేహితుడు సెయింట్ అరెజా కాలేజ్ కరస్పాండెంట్ కుసిరెడ్డి శివప్రసాదరెడ్డిని ఆమె పెళ్లి చేసుకున్నారు. వైసీపీ అధికారులు, నాయకులు, ఇతర ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు.

గొట్టేటి మాధవి స్కూల్ టీచర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. అయితే గత ఎన్నికల్లో అరకు లోక్ ‌సభకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రాజకీయ ఉద్దండుడుని ఓడించి చరిత్ర సృష్టించారు మాధవి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu