
విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ ఆర్ వెంకటాపురంలో దుర్ఘటన బాధాకరమని, మనుషులే కాదు మూగజీవాలు మృతిచెందాయని.. కొన ఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని ఆయన అన్నారు. చెట్లన్నీ రంగుమారడం విషవాయు తీవ్రతకు నిదర్శనమని.. యుద్దప్రాతిపదికన ప్రజలందరినీ ఖాళీ చేయించాలని చంద్రబాబు సూచించారు. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరమని ఆయన అన్నారు. బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యున్నత వైద్య సాయం అందించి.. సహాయ చర్యలను వేగం చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని బాబు వెల్లడించారు. కాగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీగా స్టెరీన్ గ్యాస్ లీక్ కావడంతో.. నలుగురు మృత్యువాత పడగా.. వందల మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూగజీవాలు కూడా గ్యాస్ తాకిడికి తట్టుకోలేక మరణించాయి. అక్కడికి వెళ్లిన పోలీస్ సిబ్బంది సైతం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
Read This Story Also: Breaking: ఫార్మా కంపెనీ ప్రమాదం.. వైజాగ్ వెళ్లనున్న సీఎం జగన్..!