రేయ్.. ఎవర్రా మీరంతా.. రాజధాని వాసులను షేక్ చేస్తున్న ఆ దొంగలు.. అసలేం జరిగిందంటే..
ఒకరు కాదు.. ఇద్దరూ కాదు.. ఏకంగా వంద మంది అమరావతి రాజధాని వాసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఏం జరిగిందోనని పోలీసులు కంగారు పడ్డారు. అంతమంది ఒక్కసారే స్టేషన్ వద్దకు రావడానికి కారణమేంటా అని ఆరా తీశారు. చివరికి డిఎస్పీ అశోక్ కుమార్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే రాజధాని వాసుల ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఒకరు కాదు.. ఇద్దరూ కాదు.. ఏకంగా వంద మంది అమరావతి రాజధాని వాసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఏం జరిగిందోనని పోలీసులు కంగారు పడ్డారు. అంతమంది ఒక్కసారే స్టేషన్ వద్దకు రావడానికి కారణమేంటా అని ఆరా తీశారు. చివరికి డిఎస్పీ అశోక్ కుమార్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే రాజధాని వాసుల ఫిర్యాదు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే… శుక్రవారం ఉదయాన్నే పొలానికి వెళ్లిన గేదెలు తిరిగి రాలేదు. దీంతో వెలగపూడి, మందడం గ్రామాలకు చెందిన రైతులు వాటి కోసం రాత్రి సమయంలో వెదకటం మొదలు పెట్టారు. అయితే ఒక రైతు దట్టంగా పెరిగిన చెట్ల మధ్య నుండి వెళుతుంటే.. ఇద్దరూ వ్యక్తులు అక్కడే ఉండి అటు దారి లేదంటూ చెప్పారు. దీంతో రైతుకు అనుమానం వచ్చింది. స్థానికుడైన రైతుకు దారి లేదని చెప్పడంతో అనుమానం వచ్చిన రైతు మరింత ముందుకెళ్లి చూశాడు. అక్కడ మూడు గేదెలను కట్టేసి ఉండటాన్ని గమనించాడు. దీంతో వెంటనే స్థానికులకు ఫోన్ చేసి అక్కడికి రావాలంటూ చెప్పాడు.
ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రైతులు ఘటనా స్థలానికి వచ్చారు. అయితే అక్కడే ఇద్దరూ వ్యక్తులు కూర్చోని మద్యం తాగడం, పక్కనే గేదెలుండటంతో వారిని పట్టుకున్నారు. రైతులు వస్తున్న విషయాన్ని గమనించి మరో ముగ్గురు బైక్, అశోక్ లైలాండ్ వాహనంతో పరరాయ్యారు. దీంతో వీరంతా దొంగలుగా భావించిన స్థానికులు ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇంతవరకూ బాగానే ఉంది.
శనివారం గేదెల దొంగలు దొరికినట్లు రాజధాని గ్రామాల్లో ప్రచారం జరిగింది. దీంతో వంద మందికి పైగా రాజధాని వాసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. తమ గేదెలు పోయాయంటే తమ గేదెలు పోయాయని ఫిర్యాదు చేశారు. దీంతో డిఎస్పీ స్టేషన్ కు వచ్చి అందరిని సముదాయించి పంపించారు. ఇక ముందు గేదెల దొంగతనాలు జరగకుండా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని హామీ ఇచ్చారు.
గత రెండు నెలల కాలంలో అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో 500 వరకూ గేదెలు దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమై మున్ముందు గేదెల దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు గతంలో గేదెలు పోయాయంటూ తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ పోలీసులపై స్థానికులు రుసరుసలాడుకుంటూ వెళ్లిపోయారు. ఒక్కో గెదే 50000 రూపాయలకు పైగా ధర పలుకుతుండటంతో ఈ తరహా దొంగతనాలు ఎక్కువైనట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..