
అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా శాసనసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. తాను స్వీకరించబోయే బాధ్యతను శ్రద్ధా శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా రోజా ప్రమాణం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11.05 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో, విపక్ష నేత చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. తరువాత మంత్రులతో పాటు సభ్యులు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.