రెండేళ్లయింది.. రాజధాని అమరావతి భూముల్లో ఒక్క అక్రమాన్ని బయట పెట్టలేకపోయారు : పట్టాభి

|

Jul 04, 2021 | 8:53 PM

అమరావతిలో ఏదో జరిగిందని వైసీపీ నేతలు మళ్లీ దుష్పప్రచారం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి..

రెండేళ్లయింది.. రాజధాని అమరావతి భూముల్లో ఒక్క అక్రమాన్ని బయట పెట్టలేకపోయారు : పట్టాభి
Pattabhiram
Follow us on

TDP Leader Pattabhiram : అమరావతిలో ఏదో జరిగిందని వైసీపీ నేతలు మళ్లీ దుష్పప్రచారం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మండిపడ్డారు. బినామీలకు ఒక్క ప్లాటైనా ఇచ్చారా.. అనేది రుజువు చేయాలని ఆయన వైసీపీ సర్కారుకి సవాల్‌ విసిరారు. అసైన్డ్‌ భూములు ఇతరుల పేర్ల మీద ట్రాన్స్‌ఫర్‌ కావనే విషయం కూడా వైసీపీ నేతలకు తెలియదా? అని పట్టాభి ప్రశ్నించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని.. దీంతో ప్రజల దృష్టి మరల్చడానికే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఉత్తరాంధ్రలో 15 వేల కోట్ల బాక్సైట్ తవ్వకాలు దోపిడీ ప్లాన్ బయట పడిందన్న పట్టాభి, అమరావతిలో ఏదో జరిగిందని దుష్ప్రచారం మొదలు పెట్టారు.. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది.. ఇప్పటివరకు ఆధారాలు బయట పెట్టారా? అని పట్టాభి.. సీఎం జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసైన్డ్ భూములు ఇతరుల పేర్ల మీద ట్రాన్స్ పర్ కావని పేర్కొన్న ఆయన, దళితులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, వారికి 63,410 రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చామని తెలిపారు.

ఇతరులకు ఒక్క ప్లాట్ అయినా ఇచ్చినట్లు నిరూపిస్తారా..? అని వైసీపీ నేతల్ని ఛాలెంజ్ చేసిన పట్టాభి.. ఎవరు భూమి ఇచ్చారు.. ఎవరి పేరు మీద ప్లాట్లు ఇచ్చారో సీఆర్డీఏ లో జాబితా ఉందని పేర్కొన్నారు. జీవో 1 లో.. పట్టా భూముల యజమానులతో పాటు, అసైన్డ్ భూములు యజమానులకు ప్లాట్లు ఇస్తామని చెప్పామని, మెరుగైన ప్యాకేజి ఇవ్వాలని జీవో 41 తీసుకు వచ్చామని అప్పటి టీడీపీ ప్రభుత్వ పనితనాన్ని వివరించారు పట్టాభి.

Read also : లారీని ఢీకొట్టిన కారు, అదే కారుని వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టిన వైనం, నలుగురు స్పాట్ డెడ్