బ్రేకింగ్: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు అరెస్ట్

ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులో బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీఐపీ లాంజ్‌కు తీసుకెళ్లారు.

  • Tv9 Telugu
  • Publish Date - 4:35 pm, Thu, 27 February 20
బ్రేకింగ్: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు అరెస్ట్

ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులో బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీఐపీ లాంజ్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వెనక్కి పంపడానికి కారణాలు తెలుపుతూ చంద్రబాబుకు లేఖ ఇచ్చారు పోలీసులు. 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. భద్రతా కారణాల దృష్య్టానే అరెస్ట్ చేస్తున్నట్లు చంద్రబాబుతో వారు స్పష్టం చేశారు. అయితే రెండు రోజుల పర్యటన నిమిత్తం వైజాగ్‌కు వెళ్లిన చంద్రబాబును ఎయిర్‌పోర్ట్‌కు దగ్గర్లో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. బాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న వారు.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో దాదాపు రెండున్నర గంటకు పైగా ఆయన కారులోనే వెయిట్ చేశారు. ఆ తరువాత కాసేపు రోడ్డుపై బైఠాయించారు. ఇక తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు.. తన పరిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రంలో సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎవ్వరూ ఏం చేయలేరని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.