ఆంధ్రప్రదేశ్ కు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెట్’లో ఫస్ట్ ప్లేస్ రావడంపై టీడీపీ నేతలు చెప్పిన భాష్యాల్ని తీవ్రంగా తప్పుబట్టారు ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి. గత టీడీపీ పాలన వల్లనే మొదటి ర్యాంక్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ నేతల దిగజారుడు తననానికి నిదర్శమన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్, ఆపార్టీ మాజీ ఎంపీ గల్ల జయదేవ్ తదితర నేతలు చేసిన ట్వీట్‌లు దిగజారి ఉన్నాయని.. 10వ తరగతి ఫలితాల రోజు నారాయణ స్కూల్ ర్యాంకులు ప్రచార చేసినట్టు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాజా ర్యాంకుల సర్వే ప్రక్రియ 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు జరిగిందని, ఈ సమయంలో రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందో చూసుకోవాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎంఎస్‌ఈలకు ఉపయోగపడుతుందని తెలిపారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ర్యాంకులు, వాటి సర్వేలపై అసలు సంగతులు చెప్పారు. గతంలో ర్యాంక్‌కు, ఇప్పుడొచ్చిన ర్యాంక్‌కు చాలా తేడా ఉందన్న ఆయన.. మొట్టమొదటి సారి సర్వే చేసి ఫలితాలు ఇచ్చారని చెప్పారు. గతంలో ప్రభుత్వం ఎవరిని సూచిస్తే వారితోనే సర్వే చేశారు. అది కూడా కేవలం 10శాతం మాత్రమే సర్వే చేశారని గౌతమ్ రెడ్డి అసలు సంగతి బయటపెట్టారు.