CM Jagan : పోటీపడుతున్నది ప్రభుత్వ ఆస్పత్రులతోకాదు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌తో.. : అత్యుత్తమంగా మెడకల్ కాలేజీల నిర్మాణం జరగాలి : సీఎం

|

Jun 21, 2021 | 3:36 PM

రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు శరవేగంగా..

CM Jagan : పోటీపడుతున్నది ప్రభుత్వ ఆస్పత్రులతోకాదు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌తో.. : అత్యుత్తమంగా మెడకల్ కాలేజీల నిర్మాణం జరగాలి : సీఎం
CM YS Jagan
Follow us on

New Medical colleges in AP : రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు శరవేగంగా జరగాలన్న సీఎం.. పనుల జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న ఆయన.. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధికారులు ఇచ్చిన వివరాలను సీఎం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు.

బిల్డింగ్, సర్వీసులు, నాన్‌ బిల్డింగ్‌ సర్వీసులపై అధ్యయన వివరాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఆస్పత్రి లోపలే కాకుండా, ఆవరణ కూడా అత్యంత పరిశుభ్రంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి గట్టి ఎస్‌ఓపీలను తయారు చేయాలన్నారు. మనం పోటీపడుతున్నది ప్రభుత్వ ఆస్పత్రులతోకాదు, కార్పొరేట్‌ ఆస్పత్రులతో అని సీఎం అన్నారు.

ఎక్కడా కూడా ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదన్నారు సీఎం జగన్. అనుకోని ప్రమాదాలు వచ్చే సమయంలో రోగులను భద్రంగా ఖాళీ చేయించే ఎమర్జెన్సీ ప్లాన్స్‌ కూడా సమర్థవంతంగా ఉండాలన్న సీఎం.. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరించే ప్రోటోకాల్స్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. అన్ని అంశాలనూ స్టడీ చేశాక సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు.

Read also : East Godavari : పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి, మహిళా కార్యదర్శిని దిక్కున్నచోట చెప్పుకోమన్న సర్పంచ్ భర్త