కౌలు రైతులకు శుభవార్త: జగన్

| Edited By: Anil kumar poka

Jul 26, 2019 | 4:53 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దూకుడు మీదున్నారు. మహిళలకు నామినేషన్ పదవుల్లో రిజర్వేషన్లు.. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇలా కొత్త, కొత్త చట్టాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కౌలు రైతుల కోసం కీలక చట్టాన్ని తీసుకొచ్చారు. పంటసాగుదారుల హక్కుల రక్షణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. చట్టం ఆమోదించాక ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. ‘మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ […]

కౌలు రైతులకు శుభవార్త: జగన్
Follow us on

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దూకుడు మీదున్నారు. మహిళలకు నామినేషన్ పదవుల్లో రిజర్వేషన్లు.. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇలా కొత్త, కొత్త చట్టాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కౌలు రైతుల కోసం కీలక చట్టాన్ని తీసుకొచ్చారు. పంటసాగుదారుల హక్కుల రక్షణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు.

చట్టం ఆమోదించాక ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. ‘మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కౌలురైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా కౌలురైతులకు కూడా రైతుభరోసా పథకం వర్తించేలా చట్టం తీసుకొచ్చాం. తద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు 16 లక్షల మంది కౌలురైతులకు ఏటా ఒకొక్కరికి రూ. 12,500 పెట్టుబడి సాయం అందుతుంది’అన్నారు.