Guntur GGH: ఎదురింటి వాళ్లకు పిల్లలు లేరనీ నవజాత శిశువు అపహరణ! చివరికి ఎలా దొరికిపోయిందంటే..
అది పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామం. ఉదయం పది గంటల సమయంలో పోలీసులు వాహనాలు రయ్ రయ్ మంటూ గ్రామంలోకి వచ్చాయి. వచ్చిన వెంటనే లక్ష్మీ అనే మహిళ ఇంటి ముందు ఆగాయి. అందులో నుంచి దిగిన పోలీసులు నేరుగా లక్ష్మీ ఇంటిలోకి వెళ్లారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని జీజీహెచ్‌లో అపహరించిన శిశువు ఎక్కడుందో చెప్పాలని అడిగారు. ఒక్కసారిగా పోలీసులను చూసి కంగారు పడిన లక్ష్మీ ఎదురింటి విజయలక్ష్మీకి శిశువును..

అమరావతి, అక్టోబర్ 4: అది పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామం. ఉదయం పది గంటల సమయంలో పోలీసులు వాహనాలు రయ్ రయ్ మంటూ గ్రామంలోకి వచ్చాయి. వచ్చిన వెంటనే లక్ష్మీ అనే మహిళ ఇంటి ముందు ఆగాయి. అందులో నుంచి దిగిన పోలీసులు నేరుగా లక్ష్మీ ఇంటిలోకి వెళ్లారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని జీజీహెచ్‌లో అపహరించిన శిశువు ఎక్కడుందో చెప్పాలని అడిగారు. ఒక్కసారిగా పోలీసులను చూసి కంగారు పడిన లక్ష్మీ ఎదురింటి విజయలక్ష్మీకి శిశువును అప్పగించినట్లు చెప్పింది. దీంతో ఆ ఇంటిలో ఉన్న 8 రోజుల శిశువును వెంటనే తమ ఆధీనంలోకి తీసుకొని గుంటూరు తీసుకెళ్లారు కొత్తపేట పోలీసులు. అనంతరం ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. అసలేం జరిగిందంటే…
గుంటూరు జీజీహెచ్‌లో నిన్న సాయంత్రం మూడున్నర గంటల సమయంలో తల్లి పక్కలో పడుకున్న ఎనిమిది రోజుల శిశువు తల్లి నిద్రపోయి లేచే సరికి కనిపించలేదు. గుంటూరు ఐపీడీ కాలనీకి చెందిన రోషిని గత నెల 26వ తేదిన డెలివరీ కోసం గుంటూరు జీజీహెచ్‌లో చేరింది. మరుసటి రోజు సిజేరియన్ చేయగా పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ రోజు ఢిశ్చార్జ్ అయ్యేందుకు సిద్దమవుతుండగా నిన్న గుర్తు తెలియని మహిళ రోషిని పక్కలో ఉన్న శిశువును అపహరించుకుపోయింది. సీసీ కెమెరాల ద్వారా మహిళ ఎటు వెళ్లిందో గుర్తించిన పోలీసులు ఆమెను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. జీజీహెచ్‌లోని సీసీకెమెరా విజువల్స్ లో ఆమె సెల్ ఫోన్ వాడినట్లు గుర్తించారు. ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారాంగా ఆమె ఉప్పలపాడులో ఉన్నట్లు గుర్తించి ఆమె ఇంటికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అయితే లక్ష్మీ ఎదురింటిలో ఉండే విజయ లక్ష్మీ అనే మహిళకు పిల్లలు లేకపోవడంతో లక్ష్మీ జీజీహెచ్‌లో శిశువును అపహరించి తీసుకొచ్చి ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో ఒప్పుకుంది. అయితే తనకు ప్రేమికులు బిడ్డను కని ఇచ్చారని ఆ శిశువును విజయలక్ష్మీకి పిల్లలు లేకపోవడంతో ఇచ్చానని చెప్పింది. అయితే లక్ష్మీ మాటలను పూర్తిగా విశ్వసించని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో లక్ష్మీపై ఎటువంటి కేసులు లేనట్లు ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు. శిశువు అపరించడం వెనుల అసలు కారణం ఏంటో కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




