Amaravati: అమరావతి మునిగిపోయిందని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయింది అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరల్‌ అవుతున్న దృశ్యాలు అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంభంపాడు వాగు సమీపంలోవని తెలిపింది. ఇలాంటి తప్పుడు సమాచారం స్ప్రెడ్‌ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Amaravati: అమరావతి మునిగిపోయిందని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!
Amaravathi Factcheck

Updated on: Aug 14, 2025 | 4:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగు కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు నూతనంగా నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయింది అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని వీడియో వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్నాడు జిల్లా,పెదకూరపాడు నియోజకవర్గంలో కంభంపాడు వాగు పొంగి లెవెల్ చప్టా పైనుంచి పారుతున్న నీటి దృశ్యాలను అమరావతిలో అంటూ తప్పు దోవ పట్టిస్తున్నట్టు పేర్కొంది.

ఈ కంభంపాడు వాగు అమరావతి రాజధానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలోని ఉందని.. ఆ ప్రాంతం దృశ్యాలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ అది అమరావతిలోనేనని కొందరు తప్పుడు సమాచారం అందజేస్తున్నట్టు తెలిపింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.