ఎమ్మెల్యే కరణంకు మరో కుమార్తె ఉంది: ఆమంచి ఆరోపణలు
చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలను సమర్పించారని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఈ మేరకు బలరాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. ప్రెస్‌మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. తనకు మరో భార్య, కుమార్తె ఉన్న వివరాలను బలరాం దాచిపెట్టాలని ఈ సందర్భంగా ఆమంచి ఫైర్ అయ్యారు. బలరాంకు మొత్తం నలుగురు పిల్లలైతే అఫిడవిట్‌లో ముగ్గురనే పేర్కొన్నారని ఆయన అన్నారు. దీనిపై ఈసీ చర్యలు […]
చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలను సమర్పించారని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఈ మేరకు బలరాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన.. ప్రెస్‌మీట్ పెట్టి పలు విషయాలను వెల్లడించారు. తనకు మరో భార్య, కుమార్తె ఉన్న వివరాలను బలరాం దాచిపెట్టాలని ఈ సందర్భంగా ఆమంచి ఫైర్ అయ్యారు. బలరాంకు మొత్తం నలుగురు పిల్లలైతే అఫిడవిట్‌లో ముగ్గురనే పేర్కొన్నారని ఆయన అన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని ఆయన తెలిపారు.
బలరాంకు అంబికా కృష్ణ అనే కుమార్తె ఉందని.. అన్ని సర్టిఫికేట్లలోనూ అంబికాకు బలరాం తండ్రి ఉందని ఈ సందర్భంగా కొన్ని ఆధారాలను చూపించారు. ఆమె తన కుమార్తె కాదని బలరాం అంటే ఏ పరీక్షకైనా అంబికా సిద్ధంగా ఉందని ఆమంచి వెల్లడించారు. తన తండ్రి ఎవరన్నది ప్రపంచానికి చెప్పాలన్నదే అంబికా కోరికని.. ఆమెకు న్యాయం చేయాలనే తాను ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక అంబికా ఎవరన్నది చంద్రబాబుకు కూడా బాగా తెలుసని.. బలరాం కుమార్తెగా గతంలో ఆమె రాసిన పుస్తకాన్ని బాబు ఆవిష్కరించారని ఈ సందర్భంగా తెలిపారు.