Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో భూ కేటాయింపుల వివరాలివే..
ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) సమావేశం, అలాగే 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి.

ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) సమావేశం, అలాగే 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కీలక సంస్థలకు స్థలాల కేటాయింపులతో రాజధాని అభివృద్ధికి మరో మెట్టు ఎక్కింది.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 47వ సీఆర్డీఏ భేటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాజధాని పనులపై చర్చించారు. అలాగే భూకేటాయింపులకి అమోద ముద్ర వేశారు. క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు.. బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మెడికల్ కళాశాలకు అదనంగా 6 ఎకరాలు కేటాయిస్తూ సీఆర్డీఏ భేటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ..
భూముల కేటాయింపుపై GoM నిర్ణయాలు:
ఈరోజు మంత్రుల బృందం సమావేశంలో మొత్తం 7 ప్రముఖ సంస్థలకు భూములు కేటాయించారు.
వివరాలు ఇలా ఉన్నాయి:
- లా యూనివర్సిటీకి 55 ఎకరాలు
- క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలు
- బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కళాశాలకు 15 ఎకరాలకు అదనంగా మరో 6 ఎకరాలు
- IRCTC కి 1 ఎకరం
- ఇన్కమ్ టాక్స్ శాఖకు 0.78 ఎకరాలు
- కోస్టల్ బ్యాంక్ కు 0.4 ఎకరాలు
ఇంతవరకు మొత్తం 71 సంస్థలకు 1050 ఎకరాల భూములను కేటాయించడం జరిగింది. ఇందులో ఇప్పటికే గతంలో 64 సంస్థలకు భూముల కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే.
సీఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం – భారీ మౌలిక ప్రాజెక్టులకు ఆమోదం:
ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతిలో మౌలిక నిర్మాణాలను వేగవంతం చేయడంపై కీలకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి:
రూ.514 కోట్లతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణానికి అనుమతి
మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా రూ.194 కోట్లు విడుదలకు అనుమతి
9 టవర్ల నాన్ గెజిటెడ్ అధికారుల నివాస భవనాలు, మౌలిక సదుపాయాలకు రూ.517 కోట్లతో టెండర్లకు అనుమతి
మొత్తంగా రూ.1732.31 కోట్ల విలువైన నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చారు..
నీటి సరఫరా, రహదారుల అభివృద్ధి:
190 MLD సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.568.57 కోట్లతో టెండర్ పిలవడం జరిగింది
15 ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి రూ.494 కోట్లకు అనుమతి
3.5 కిలోమీటర్ల ఈ3 ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి అనుమతి
15, 13 రహదారులను జాతీయ రహదారులకు అనుసంధానం చేయడం కోసం రూ.70 కోట్లు, రూ.387 కోట్లతో పనులు చేపట్టనున్నారు
ఈ అన్ని నిర్ణయాలు అమరావతిని ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగులు. భవిష్యత్తులో విద్య, వైద్య, బ్యాంకింగ్, పౌరసరఫరాలు వంటి రంగాల్లో విస్తృత సేవలు అందించేందుకు బలమైన మౌలిక ఆధారాల స్థాపన జరుగుతోంది.
భవిష్యత్తు అభివృద్ధికి అడ్డుగల అడుగులు వేస్తున్న ప్రభుత్వం, అమరావతిని అభివృద్ధి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా నిరంతరంగా కృషి చేస్తోంది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీ పి.నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.#AndhraPradesh pic.twitter.com/5hdVxKjXYZ
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 6, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..