ఆడవాళ్ల రక్షణ కోసం ఉపయోగపడే దిశా యాప్‌ను మరింత మందికి చేరువ చేసేలా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే బట్టల షాప్‌లో కొనుగోళ్లపై 15 శాతం డిస్కౌండ్ ఇచ్చేలా వినూత్న ఆఫర్ ప్రకటించారు. అమలాపురంలోని ప్రముఖ షాపింగ్ మాల్ వద్ద మహిళ పోలీసులతో దిశ యాప్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు షాపింగ్ మాల్‌కు పోటెత్తారు.
దిశా యాప్‌ను డౌన్‌లోడ్చేసుకోని ఆ షాపింగ్ మాల్‌లో 15 శాతం రాయితీ పొందుతున్నారు. ప్రతిఒక్క మహిళ దగ్గర రక్షణ కోసం ఈ యాప్ ఉండాలనే ఆలోచనతోనే ఈ ఆఫర్ పెట్టామని డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. దీనికి తోడు ఈ రోజు ఆదివారం కావడంతో చాలామంది మహిళలు ఆ షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..