రూ.25 లక్షల వరకూ ‘ఆరోగ్యశ్రీ’.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు.!

| Edited By: Ravi Kiran

Dec 27, 2023 | 12:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ప‌రిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల నిర్ఱయం తీసుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం జ‌గ‌న్ ముందుకెళ్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో నాడు-నేడు ద్వారా పెద్ద ఎత్తున సిబ్బంది నియామ‌కంతో..

రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు.!
Andhra CM Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ప‌రిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల నిర్ఱయం తీసుకున్నారు. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం జ‌గ‌న్ ముందుకెళ్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో నాడు-నేడు ద్వారా పెద్ద ఎత్తున సిబ్బంది నియామ‌కంతో పాటు అన్ని ర‌కాల వైద్య సేవ‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. వివిధ ర‌కాల ప‌రీక్షల‌కు సైతం బ‌య‌ట‌కు వెళ్లే అవ‌స‌రం లేకుండా అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌ను ఏర్పాటు చేసారు. మ‌రోవైపు ఆరోగ్యశ్రీ ప‌రిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివ‌ర‌కూ ఉన్న దానికంటే సుమారు ఐదు రెట్ల మేర ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీని విస్తరించారు. ఇక‌పై 25 లక్షల వ‌ర‌కూ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఉచితంగా వైద్యం అందించ‌నున్నారు. వెయ్యి రూపాయ‌లు దాటిన ప్రతి చికిత్సకు ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేసారు. ఇప్పటివ‌ర‌కూ ఉన్న 5 ల‌క్షల ప‌రిమితిని 25 ల‌క్షల‌కు పెంచింది ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల‌తో పాటు రిఫ‌ర‌ల్ ఆసుప‌త్రుల సంఖ్యను కూడా పెంచింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌లోని మ‌ల్టీ స్పెషాలిటీ సేవ‌లు అందించే ప‌లు హాస్పిట‌ల్స్‌లో కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా సేవ‌లు అందించేలా ఏర్పాట్లు చేసింది.

సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువ‌చ్చింది. మొత్తం కోటీ 48 ల‌క్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది ప్రభుత్వం.. ఆయా కుటుంబాల్లోని సుమారు 4 కోట్ల 25 లక్షల మంది ప్రజ‌లు ఆరోగ్యశ్రీ ప‌రిధిలోకి వ‌చ్చారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 3 వేల‌ 257 ప్రొసీజర్లకు ఉచిత చికిత్సలు అందిస్తుంది ప్రభుత్వం. గతంలో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు 748 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఇత‌ర రాష్ట్రాల్లో క‌లిపి 2 వేల 513 హాస్పిట‌ల్స్‌కు ఆరోగ్యశ్రీ సేవ‌లు విస్తరించింది. హైదరాబాద్‌లో 85, బెంగుళూరులో 35, చెన్నైలో 16 ఆస్పత్రులతో క‌లిపి మొత్తం 204 ఆసుప‌త్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవ‌లు అందిస్తుంది. ఆరోగ్యశ్రీ ప‌రిధి పెంచిన త‌ర్వాత కొత్తగా క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డుల‌ను ఇంటింటికి అందిస్తుంది. ప్రస్తుతం ఈ కార్డుల మంజూరు శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవ‌లు పొంద‌డంపై ఇంటింటి ప్రచారం..

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌రిధి విస్తరించిన త‌ర్వాత కొత్తగా కార్డులు మంజూరు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేసారు. దీంతో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డుల‌ను సిద్దం చేసారు అధికారులు. ఈ నెల 19 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం అయింది. వాలంటీర్లు, స‌చివాల‌య సిబ్బంది క‌లిసి ఇంటింటికి వెళ్లి కార్డులు పంపిణీ చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాల‌జీతో అప్‌గ్రేడ్ చేసిన స్మార్ట్‌కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రోగికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి. రోగికి ఉన్న స‌మ‌స్యలు, గ‌తంలో చేయించుకున్న చికిత్సకు సంబంధించిన వివ‌రాలు, ఉప‌యోగించిన మందులు, ఇలా అన్ని అంశాలు పొందుప‌రిచి ఉంటాయి. దీని ద్వారా ఒక రోగి ఎన్నిసార్లు ఆసుప‌త్రికి వెళ్లిన‌ప్పటికీ వారికి ఎలాంటి వైద్యం అవ‌స‌ర‌మ‌వుతుంద‌నేది డాక్టర్లు సులువుగా తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది. ఇక ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ స‌మ‌యంలోనే ల‌బ్దిదారుల మొబైల్ ఫోన్‌ల‌లో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తున్నారు సిబ్బంది.

ఈ యాప్‌లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆసుప‌త్రుల వివ‌రాలు, ఏ హాస్పిట‌ల్‌లో ఏ రోగానికి వైద్యం అందుతుంద‌నే అన్ని వివ‌రాలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ సేవ‌లు ఎలా పొందాలి.? ఉచితంగా సేవ‌లు ఎలా చేయించుకోవాలి.? వంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పటివ‌ర‌కూ లక్షా 50 వేల కార్డుల పంపిణీ పూర్తయింది. ఇక‌పై మ‌రింత వేగంగా కార్డుల‌ను జారీ చేయాల‌ని ప్రభుత్వం సూచించింది. కార్యక్రమాల‌కు కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రతి రోజూ నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ప్రతి వారం మండ‌లానికి నాలుగు గ్రామాల చొప్పున ఏఎన్ ఎంలు, సీహెచ్‌వోలు,ఆశా వ‌ర్కర్లతో పాటు ప్రజాప్రతినిధులు స్మార్ట్ కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారు. వ‌చ్చే నెలాఖ‌రు నాటికి ఈ కార్డుల పంపిణీ పూర్తి చేయాల‌ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్డు చేతిలో ఉంటే చాలు 25 లక్షల ఉచిత‌ వైద్యం ఉన్నట్లే అని ప్రభుత్వం ప్రజ‌ల‌కు వివ‌రిస్తుంది.