AP Capital: అమరావతి రాజధాని కోసం గళమెత్తిన మరో మహిళ.. 250 కిలోమీటర్లు పాదయాత్ర

|

Mar 14, 2023 | 4:28 AM

అమరావతి రాజధాని కోసం ఏపీలో ఉద్యమం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమరావతి రాజధాని కోసం కోనసీమ జిల్లా మండపాడు నుంచి ఓ మహిళ 250 కిలోమీటర్ల..

AP Capital: అమరావతి రాజధాని కోసం గళమెత్తిన మరో మహిళ.. 250 కిలోమీటర్లు పాదయాత్ర
Andhra Pradesh
Follow us on

అమరావతి రాజధాని కోసం ఏపీలో ఉద్యమం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమరావతి రాజధాని కోసం కోనసీమ జిల్లా మండపాడు నుంచి ఓ మహిళ 250 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఈ నెల ఒకటో తారీకున బయలుదేరి సోమవారం తాడేపల్లి వారధి వద్దకు చేరుకున్నారు టీడీపీ మహిళా కార్యకర్త సినీ ఆర్టిస్టు ళ్రీవాణి.

వారధి చేరుకున్న వల్లూరి శ్రీవాణి మంగళవారం అమరావతి రైతులను కలవనున్నారు. అమరావతిని కాపాడాలని, అమరావతి రైతులను కాపాడాలని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఈ పాదయాత్ర ద్వారా ఆమె డమాండ్‌ చేశారు.

రాబోయే ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కూడా ఆమె ప్రజలను కోరుకున్నారు. రాబోయే తరాలకు అమరావతి రాజధాని మార్గదర్శకంగా ఉంటుందని తెలియజేసేందుకే పాదయాత్ర ప్రారంభించానని.. అమరావతి రైతుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలని ఆమె కోరారు.

ఇవి కూడా చదవండి

దారి పొడవునా పార్టీ కార్యకర్తలు నాయకులు తన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారన్నారు శ్రీవాణి. తనకు మద్దతును తెలియజేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి