నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ.. గోవిందా నామస్మరమతో మారుమోగే తిరుమలలో విషాదం నెలకొంది. వరాహస్వామి రెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న టాయిలెట్స్ లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు శౌచాలయానికి వెళ్లిన ఆమె.. ఎవరూ లేని సమయంలో నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. టీటీడీ అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టగా.. మృతి చెందిన ఆమె విజయవాడకు చెందిన సుమతిగా గుర్తించారు. కాగా..ఈ ఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేలా చూడాలని కోరుతున్నారు.
మరోవైపు.. సైబర్ క్రైమ్ పై పోలీసులు అవగాహనం కలిగిస్తున్నారు. తిరుపతి పోలీసు పరేడ్ మైదానంలోని సైబర్ క్రైమ్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే త్వరగా రికవరీ సాధ్యమవుతుందన్నారు. లోన్ యాప్‌లు డౌన్‌లోడ్ సమయంలో ఫోన్ కాంటాక్ట్స్, మీడియా, గ్యాలరీ, కెమెరాలకు సంబంధించిన ఆప్షన్స్‌కు అనుమతి ఇవ్వకుండా ఉంటే వ్యక్తిగత సమాచా రం వారి చేతికి వెళ్లకుండా ఉంటుందని సూచించారు. వాట్సప్, టెలిగ్రామ్, ఇతర గుర్తు తెలియని నంబర్ల నుంచి చరవాణికి వచ్చే లింకులను సాధ్యమైనంత వరకు ఓపెన్ చేయకూడదని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..