Andhra Pradesh: సుపారీ ఇచ్చి మరీ కొడుకు లేపేసిన తల్లిదండ్రులు.. అంత ఆగ్రహం ఎందుకంటే..
Andhra Pradesh: కన్న తల్లిదండ్రులన్న ఇంగిత జ్ఞానం లేదు ఆ కొడుక్కి.. కన్న కొడుకన్న కనికరం లేదు ఆ తల్లినదండ్రులకి.. ఇంకేముంది కొడుకు హత్య కోసం కిరాయి గుండాకి సుపారి ఇచ్చారు. చివరికి కటకటాలపాలయ్యారు. కసాయి తల్లిదండ్రులతో పాటు సుపారీ గ్యాంగ్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. మరి ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? వంటి కీలక వివరాలు ఓసార చూద్దాం..
Andhra Pradesh: కన్న తల్లిదండ్రులన్న ఇంగిత జ్ఞానం లేదు ఆ కొడుక్కి.. కన్న కొడుకన్న కనికరం లేదు ఆ తల్లిదండ్రులకి.. ఇంకేముంది కొడుకు హత్య కోసం కిరాయి గుండాకి సుపారి ఇచ్చారు. చివరికి కటకటాలపాలయ్యారు. కసాయి తల్లిదండ్రులతో పాటు సుపారీ గ్యాంగ్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. మరి ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? వంటి కీలక వివరాలు ఓసార చూద్దాం..
భద్రాచలంలోని లిటిల్ ఫ్లవర్స్ కాలేజీ పక్కన ఓ చిన్న కుటుంబం. కొడుకు తాగుబోతు. ఫుల్ గా తాగి తల్లినదండ్రులన్న ఇంకిత జ్ఞానం లేకుండా కొడుతుండేవాడు. భూమి తగాదాతో రోజూ గొడవ పడుతుండేవాడు. ఇంటిని తన పేరున రాసివ్వమని వేధించేవాడు. దాంతో ఇంటిని అమ్మేసి వేరే ఊరు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు ఆ తల్లిదండ్రులు. కొడుకు అడ్డుపడుతుండడంతో విసిగి వేసారిన ఆ తల్లినదండ్రులు.. తమ కొడుకుని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. భద్రాచలంలోని జగదీష్ కాలనీ కి చెందిన గుమ్మడి రాజు అనే వ్యక్తికి తమ కొడుకుని హత్య చేసేందుకు రూ.3 లక్షలు సూపారి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.
అతడికి తోడు షేక్ అలీ పాషా అనే వ్యక్తితో కలిసి ఈనెల 9వ తేదీ రాత్రి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. దుర్గా ప్రసాద్‌ను మేకలు కోసే కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. హత్య నుండి తప్పించుకునేందుకు మృతదేహాన్ని ఎటపాక మండలం తుమ్మల నగర్ శివారులోని అడవిలో దహనం చేశారు. మరుసటి రోజు కట్టెల కోసం వెళ్ళిన ఓ వ్యక్తికి సగం కాలిన యువకుడి మృతదేహం కనపడడంతో స్థానిక విఆర్‌వో కి సమాచారం అందించారు. దాంతో విఆర్‌వో ఇచ్చిన ఫిర్యాదుతో గుర్తు తెలియని మృత దేహం లభించినట్లు కేసునమోదు చేశారు ఎటపాక పోలీసులు.
మృత దేహం ఫోటోలు వాల్ పోస్టర్స్ వేయడంతో గుర్తించి దుర్గా ప్రసాద్ భార్య, బంధువులు ఎటపాక పోలీసులను ఆశ్రయించారు. దీంతో వివరాలు సేకరించిన పొలీసులు విచారణ చేపట్టారు. హత్య చేసిన భద్రాచలానికి చెందిన గుమ్మడి రాజు, షేక్ అలీ పాషా, హత్య చేయించిన తల్లి దండ్రులు పల్లంగి సావిత్రి, పల్లంగి రాము లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకల బట్టలు, మృత దేహాన్ని తరలించెందుకు ఉపయోగించిన ఆటో, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈమేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వివరాలు వెల్లడించారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..