Andhra News: ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..

అనుమానంతో ప్రియురాలిని హత్య చేసి పోలీసులకు ప్రియుడు లొంగిపోయాడు. అసలు ఏం జరిగింది? 20 ఏండ్లు రిలేషన్‌లో ఉండి ఎందుకు ఆమెను చంపాడు?

Andhra News: ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..
A Boyfriend Who Killed His Girlfriend On Suspicion And Surrendered To The Police In Guntur
Follow us
T Nagaraju

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 11, 2024 | 12:08 PM

ఆమె పేరు రమాదేవి..  సత్తెనపల్లి రంగా కాలనీలో నివాసం ఉండే రమాదేవికి వివాహమైంది.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన వెంకట్రావుతో రమాదేవికి వివాహేతర సంబంధం ఉంది. వెంకట్రావుకి వివాహమై ఇద్దరూ పిల్లలున్నారు. రమాదేవి, వెంకట్రావులకు పెళ్లై పిల్లలున్నా వీరిద్దరి మధ్య గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. దాదాపు ఇరవై ఏళ్ల నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రమాదేవి తన బంగారాన్ని వెంకట్రావు చేత బ్యాంక్‌లో తాకట్టు పెట్టించింది. అయితే ఇద్దరూ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేకపోవడంతో అంతా సవ్యంగానే సాగుతోంది. అయితే ఈ మధ్య కాలంలో రమాదేవి సోదరి చనిపోవటం ఇద్దరి మధ్య తగువుకు కారణమైంది.

రమాదేవి సోదరి రంగాకాలనీలోనే ఉంటుంది. పక్షవాతంతో మంచం పట్టిన రమాదేవి సోదరి ఈ మధ్య కాలంలో చనిపోయింది. అయితే రమాదేవి సోదరి భర్తతో చనువుగా ఉంటున్నట్లు పుకార్లు వచ్చాయి. అవి వెంకట్రావు దృష్టికి వెళ్లాయి. అయితే మొదట్లో వాటిని కొట్టి పారేసిన వెంకట్రావు.. తర్వాత జరిగిన ఘటనలతో అనుమానం పెంచుకున్నాడు. రమాదేవి తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకొని రమ్మని ఈ మధ్య కాలంలో తరుచూ చెబుతూ వస్తుంది. మరోవైపు మన మధ్య ఉన్న సంబంధాన్ని ఇక కొనసాగించవద్దని చెప్పింది. దీంతో వెంకట్రావు రమాదేవి ఉద్దేశపూర్వకంగానే తనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తోందని భావించాడు.

బంగారాన్ని విడిపించుకురావాలని పదే పదే అడగటంతో ఈ అనుమానం మరింత బలపడింది. ఈ విషయాన్నే సాకుగా తీసుకున్న వెంకట్రావు రాజుపాలెం రావాలని రమాదేవికి చెప్పాడు. రమాదేవి రాజుపాలెం వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి అచ్చంపేట రోడ్డులోని గండ్లూరు అడ్డరోడ్డులో ఉన్న పొలాల వద్దకు చేరుకున్నారు. మద్యం సేవిస్తూ వెంకట్రావు రమాదేవికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె మాత్రం బంగారాన్ని విడిపించి ఇక నుండి దూరంగా ఉండాలనే పట్టుబట్టింది. దీంతో కోపాన్ని అణుచుకోలేని వెంకట్రావు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత వెంకట్రావు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. మరోవైపు రమాదేవి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు రమాదేవి మృతదేహం ఉన్న చోటు గురించి తెలిసింది. వెంకట్రావు తానే చంపానని చెప్పడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి