రామాయణంలో రావణాసురుడుకి పది తలలు ఉంటాయని చెబుతుంటారు. నిజరూపంలో కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఓ కొబ్బరి చెట్టు తొమ్మిది తలలతో అబ్బుర పరుస్తోంది. రామచంద్రపురం నియోజకవర్గం బ్రహ్మపురి గ్రామానికి చెందిన దంతులూరి నానాజీ మాస్టార్ కుటుంబ సభ్యులకు కోలంక వ్యయసాయ క్షేత్రంలో ఓ కొబ్బరి చెట్టును చాలా కాలం క్రితం నాటారు. కొబ్బరి చెట్టు పెరిగిన కొద్దీ ఒక తల తర్వాత ఒక తల వేస్తూ నేటికీ తొమ్మిది తలలుతో కనిపిస్తోంది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. తొమ్మిది తలలు, తొంబై కాయలు కాస్తూ ఈ కొబ్బరి చెట్టు అధికంగా దిగుబడి వస్తుందని యజమానులు చెబుతున్నారు.
ఈనేపథ్యం లో తొమ్మిది తలల కొబ్బరి చెట్టును పలువురు తిలకిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తొమ్మిది తలల కొబ్బరి చెట్టును గ్రామస్తులు దుర్గమ్మ తల్లిగా భావించి పూజలు చేస్తున్నారు. పలువురు సందర్శకులు ఇక్కడకు విచ్చేసి తొమ్మిది తలల కొబ్బరి చెట్టును నేటికీ తిలకిస్తూ.. సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..