Aghori: భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి అనుమతి లేదు.

Aghori: భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి అనుమతి లేదు.

Anil kumar poka

|

Updated on: Nov 15, 2024 | 11:44 AM

తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ సంచలనం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రముఖ శైవక్షేత్రాలను సందర్శిస్తున్న అఘోరీ.. ఇటీవల ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుంది. అనంతరం తన యాత్ర కొనసాగించింది. తాజాగా అఘోరీ సోమవారం రాత్రి కాకినాడ జిల్లా సామర్లకోటలోని మాదన్నపట్నం భీమేశ్వర ఆలయానికి వెళ్లింది.

తాజాగా అఘోరీ కాకినాడ జిల్లా సామర్లకోటలోని మాదన్నపట్నం భీమేశ్వర ఆలయానికి వెళ్లింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి కావడంతో ఆలయంలోకి వెళ్లలేనని, ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పింది. దీంతో పోలీసులు రాత్రంతా అఘోరీకి కాపలా ఉన్నారు. భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షించారు పెద్దాపురం డి.ఎస్.పి శ్రీహరి రాజు. అఘోరీ తాను ప్రయాణించే కారును నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి రాత్రంతా అందులోనే గడిపింది. కారులోనే పూజాధికాలు పూర్తి చేసుకుంది.

అఘోరి కారులో పెట్రోల్ క్యాన్ ఉండటం పట్ల పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కారులో అగరబత్తీలు వెలిగించి.. పెట్రోల్ క్యాన్ పక్కనే ఉంచడంతో…ప్రమాదం జరిగే అవకాశం ఉందని పెట్రోల్ క్యాన్ ఇవ్వాలని పోలీసులు కోరారు. అందుకు అఘోరీ అంగీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక పెట్రోల్ క్యాన్ తీసుకునే సాహసం చేయలేదు పోలీసులు. రాత్రంతా అఘోరీకి రక్షణగా పోలీసులు అక్కడే ఉన్నారు. మంగళవారం ఉదయం సామర్లకోట భీమేశ్వర స్వామి దర్శనానికి పోలీసుల భద్రత మధ్య చేరుకుంది. కానీ ఆలయంలోకి ప్రవేశించాలంటే వస్త్రాలు ధరించాలని ఆలయ అధికారులు, పోలీసులు సూచించడంతో వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకుంది. అఘోరి రాకతో స్థానిక ప్రజలు, భక్తులు ఆమెను చూడడానికి ఆలయం వద్దకు పోటెత్తారు. పోలీసులు ఆలయ అధికారులు దగ్గరుండి ఆమెకు స్వామి దర్శనం చేయించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.