ఇంటికి పెద్ద రంధ్రం చేసిన దొంగలు.. బంగారు, వెండి కోసం కాదు.. మరి దేని కోసమో తెలుసా..?

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 03, 2023 | 5:45 PM

Tenali: తెనాలి మండలం జగడగుంటపాలెం శివారులో రేకుల షెడ్ పైకెక్కిన దొంగలు, రేకులకు రంధ్రం వేసి లోపలికి దిగారు. అక్కడే ఉన్న కాపలా కుక్కను రాళ్లతో కొట్టారు. కర్రతో బాదారు. కుక్క ఓ ప్రక్క కెళ్ళి భయపడి దాక్కుంది. ఆ తరువాత దొంగలు తమ పని తాము చేసుకుని దర్జాగా బయటకు వెళ్ళిపోయారు. ఇంతకీ వాళ్లు కాజేసింది ఏమిటో తెలుసా? కోళ్లను, మొత్తం ఎనిమిది కోళ్లు..

ఇంటికి పెద్ద రంధ్రం చేసిన దొంగలు.. బంగారు, వెండి కోసం కాదు.. మరి దేని కోసమో తెలుసా..?
Spot Visuals
Follow us on

తెనాలి, ఆగస్టు 3: ఇళ్లల్లో దొంగలపడి నగలు ఎత్తుకెళ్లటం చూసాం, డబ్బులు కాజేయడం చూశాం. మరి ఈ దొంగలేం కాజేశారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. తెనాలి మండలం జగడగుంటపాలెం శివారులో రేకుల షెడ్ పైకెక్కిన దొంగలు, రేకులకు రంధ్రం వేసి లోపలికి దిగారు. అక్కడే ఉన్న కాపలా కుక్కను రాళ్లతో కొట్టారు. కర్రతో బాదారు. కుక్క ఓ ప్రక్క కెళ్ళి భయపడి దాక్కుంది. ఆ తరువాత దొంగలు తమ పని తాము చేసుకుని దర్జాగా బయటకు వెళ్ళిపోయారు. ఇంతకీ వాళ్లు కాజేసింది ఏమిటో తెలుసా? కోళ్లను మాత్రమే. మొత్తం ఎనిమిది కోళ్లు.. ఏంటి? కోళ్ల కోసమా అనుకుంటున్నారా? ఆ కోళ్లు సాదాసీదా కోళ్లు కాదండి.. ఒక్కొక్క కోడి 20 వేల రూపాయలు ఉంటుంది. ఈ కోళ్లన్నీ జాతి కోళ్లు, వీటిని సంవత్సరం పాటు పెంచి సంక్రాంతి పండగ సమయంలో విక్రయిస్తే అధిక ధర వస్తుంది.

నిరుద్యోగులకు ఈ వ్యాపారం ఎంతో అనుకూలంగా ఉంటుందనీ నిర్వాహకుడు సుభాని చెబుతున్నారు. దొంగతనం జరిగిన కోళ్ల ఖరీదు అక్షరాల లక్షా అరవై వేల వరకు ఉంటుందని చెప్పాడు.ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన జీవనోపాధిపైన దెబ్బ కొట్టిన దొంగలని పట్టి తనను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాడు సుభాని. విచిత్రమైన దొంగతనంపై ‌పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. దొంగను పట్టుకోవడం ఎంత ముఖ్యమో వాళ్ళు దొంగలించిన కోళ్ళను స్వాధీనం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి తెనాలి పోలీసులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే..