Kadapa: ఈ చిన్ని చేతులు అద్భుతాన్ని చేశాయ్.. పిల్లాడు చేసిన పనికి ప్రొద్దుటూరు మురిసింది
అంతేకాకుండా పట్టణంలోని మురికి కాలువలకు అన్నిచోట్ల కంచెలు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆ విద్యార్థి కోరడంతో.. స్పందించిన మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకుంటామని ఆ బాలుడికి హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో కాలువలకు పైభాగాన ఎటువంటి కంచె లేకపోవడంతో చాలామంది అనేక సార్లు ఈ మురికి కాలువలో పడిన సంఘటనలు ఉన్నాయి.

సొంత వారి బాధలే పట్టని ఈ రోజుల్లో తోటి విద్యార్థి పడిన బాధ చూసి చలించిపోయిన ఒక విద్యార్థి డైరెక్ట్‌గా మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చిన సంఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఎవరికి ఏమైతే నాకేమీ అనుకున్న ఈ రోజులలో తన స్నేహితుడి బాధ చూసి తన బాధగా దానిని స్వీకరించి మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన తోటి విద్యార్థి చేసిన పనిని అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో మున్సిపల్ స్కూల్‌లో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థి ఎబినేజర్ తన స్నేహితుడు పడిన బాధ చూసి ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రరెడ్డికి వినతిపత్రం ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని రెండవ వార్డు మున్సిపల్ స్కూల్ వెనుక ఉన్న మురికి కాలువకు కంచె ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరాడు. తన మిత్రుడు ఆడుకుంటూ మురికి కాలువలో పడిపోయాడని.. తన మిత్రులు ఇంకెవరూ మురికి కాలువలో పడకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఎబినేజర్ తెలిపాడు. అంతేకాకుండా పట్టణంలోని మురికి కాలువలకు అన్నిచోట్లా కంచెలు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆ విద్యార్థి కోరడంతో.. స్పందించిన మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో కాలువలకు పైభాగాన ఎటువంటి కంచె లేకపోవడంతో చాలా మంది అనేక సార్లు ఈ మురికి కాలువలో పడిన సంఘటనలు ఉన్నాయి. అందులో భాగంగానే తన స్నేహితుడు కూడా ఇలా ఆడుకుంటూ స్కూలు వెనుక ఉన్న మురికి కాలువలో పడడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని అందుకే చలించిపోయి మున్సిపల్ కమిషనర్‌కి ఈ లెటర్ ఇచ్చినట్టు ఆ విద్యార్థి తెలిపాడు. ఏది ఏమైనా తన తోటి విద్యార్థి పడిన బాధను చూసి తాను చలించిపోయి కమిషనర్‌కు వినతి పత్రం ఇవ్వడంపై ఆ విద్యార్థి చేసిన పనికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
