Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajanagaram: రాజానగరం డ్రగ్స్ కేసు.. స్టన్ అయ్యే విషయాలు చెప్పిన పోలీసులు

ఆన్‌లైన్‌ డ్రగ్‌ దందా పల్లెబాటపట్టింది. గోదావరి జిల్లాలో ఢిల్లీ డ్రగ్స్‌ కలకలం రేపాయి.. రిసార్ట్‌ కల్చర్‌తో పాటు డ్రగ్‌ మరక రాజానగరంను షేక్‌ చేసింది.. బర్త్‌ డే పేరిట మత్తు పార్టీ గుట్టును రట్టు చేశారు పోలీసులు. తనిఖీల్లో కర్నాటక లిక్కర్‌తో పాటు డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.

Rajanagaram: రాజానగరం డ్రగ్స్ కేసు.. స్టన్ అయ్యే విషయాలు చెప్పిన పోలీసులు
Rajanagaram Police
Ram Naramaneni
|

Updated on: Oct 11, 2024 | 1:22 PM

Share

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం శివారు భూపాలపట్నంలో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో నలుగుర్ని అరెస్ట్‌ చేశారు. పరారీలో వున్న పవన్‌ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితులు తాడేపల్లి గూడెంకు చెందిన వాళ్లు. భూపాలపట్నంలోని సీర్‌ స్టూడియో గెస్ట్‌ హౌస్‌లో బర్త్‌ డే వేడుక ఏర్పాటు చేశారు. బంధువులకు పార్టీతో పాటు.. మిత్రులు డ్రగ్‌ పార్టీ ప్లాన్‌ చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. సీర్‌ స్టూడియో గెస్ట్‌ హౌస్‌పై రెయిడ్‌ చేస్తే డ్రగ్స్‌ గుట్టు బయటపడింది. ఖరీదైన కర్నాటక లిక్కర్‌తో పాటు గంజాయి, MDMA సహా కారును సీజ్‌ చేశారు. నిందితులు ఢిల్లీ నుంచి ఓ కొరియర్ సర్వీస్‌లో డ్రగ్స్‌ను తెప్పించుకున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు డీఎస్పీ దేవకుమార్‌.

టెలిగ్రామ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి.. ఢిల్లీ నుంచి డైరెక్టర్‌గా డ్రగ్‌ డెలివరీ చేసిన వైనాన్ని బ్రేక్‌ చేశారు పోలీసులు. నిందితులు తాడేపల్లి గూడెంకు చెందిన దేవభక్తుల దినేష్, వేమన విక్రమ్ రాధా, బాలం అజయ్, దువ్వానబోయిన పుష్ప రాజ్ నలుగుర్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

యువత ఇలా డ్రగ్స్‌ మహమ్మారి వలలో పడకుండా పేరెంట్స్‌ అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. డ్రగ్స్‌ వాడినా, కొన్నా, అమ్మినా చట్టరీత్యా నేరం. ఎరైనా ఎక్కడైన డ్రగ్స్‌ దందా చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే దగ్గరలోని పీఎస్‌లో సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..