AP News: ఏపీ ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్.. ఇకపై ఆ మూడు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగవు.!

|

Jul 17, 2024 | 5:28 PM

ఏపీ ప్రజలకు నిజంగా ఇది బ్యాడ్‌న్యూస్. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇప్పటిదాకా ఉన్న స్టాప్‌లను ఎత్తివేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఆ రైళ్లు ఏంటి.? ఎప్పటి నుంచి ఈ ఆదేశాలకు అమలులోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: ఏపీ ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్.. ఇకపై ఆ మూడు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగవు.!
Indian Railways
Follow us on

ఏపీ ప్రజలకు నిజంగా ఇది బ్యాడ్‌న్యూస్. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇప్పటిదాకా ఉన్న స్టాప్‌లను ఎత్తివేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఆ రైళ్లు ఏంటి.? ఎప్పటి నుంచి ఈ ఆదేశాలకు అమలులోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా

వివరాల్లోకెళ్తే.. సికింద్రాబాద్ నుంచి వయా మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు మీదుగా నడిచే నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లకు జూలై 19 నుంచి మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో స్టాప్‌లను ఎత్తివేస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా సమయంలో ఆయా స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నై రైళ్లను నిలపకూడదని రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణీకులు ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది

ఇక అప్పటి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రైల్వే బోర్డు అధికారులతో చర్చలు జరిపి.. ఏడాది క్రితం ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆయా స్టేషన్లను స్టాప్‌లుగా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఏడాది పాటు ఈ రైళ్లను ఆపేందుకు రైల్వే అధికారులు ఆదేశాలు ఇవ్వగా.. ఆ సమయం ఈ నెల 19న ముగియనుంది. అలాగే జూలై 19 నుంచి విశాఖ, నారాయణాద్రి, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లకు ఐఆర్‌టీసీ మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లకు రిజర్వేషన్లు నిలిపివేసింది. అటు విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు నల్గొండలో కూడా స్టాప్ ఎత్తివేశారు.

ఇది చదవండి: లవ్‌లీ మూవీ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..