Snakes Spotted at TTD: బాబోయ్.. తిరుమల నడక మార్గంలో 3 కోడె నాగులు.. దెబ్బకు భక్తులు గజగజ!

నిత్యం వెంకన్న భక్తులతో కిటకిటలాడే తిరుమలలో ఇటీవల అటవీ జంతువులు వరుసగా దర్శనమిస్తున్నాయి. పులులు, చిరుతలతోపాటు విషపూరితమైన నాగులు తిరుమల నడక మార్గంలో ప్రత్యక్షం అవుతున్నాయి. వీటిని చూసి భక్తులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా అక్కడ నడకమార్గంలో ఒకే రోజు 3 నాగులు కనిపించాయి..

Snakes Spotted at TTD: బాబోయ్.. తిరుమల నడక మార్గంలో 3 కోడె నాగులు.. దెబ్బకు భక్తులు గజగజ!
Python Snakes Spotted at TTD

Edited By:

Updated on: Mar 05, 2025 | 9:00 PM

తిరుపతి, మార్చి 5: శేషాచలం అటవీ ప్రాంతం. ఈ అడవి ఎన్నో జంతు జాతులకే కాదు అరుదైన వృక్ష సంపదకు నిలయం. మరెన్నో సర్ప జాతులు, విష సర్పాలు ఉన్న బయో స్పియర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో తరచూ భక్తులకు దర్శనమిస్తున్న పాములు బుసలు కొడుతున్నాయి. తిరుమలలోనే కాకుండా తరచూ తిరుమల నడక మార్గాల్లోనూ భక్తులకు కనిపిస్తున్న విష సర్పాల నుంచి ఇప్పటి దాకా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోయినా పాములు మాత్రం భక్తులను బెదరగొడు తున్నాయి.

తిరుమల వెంకన్న దర్శనం కోసం కొండకు వచ్చిన భక్తులకు బుధవారం మూడు చోట్ల పాములు దర్శనమిచ్చాయి. అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద షాప్ నెంబర్ 2లో ఆరడుగుల నాగు పాము బుసలు కొట్టడాన్ని భక్తులు స్థానికులు గమనించారు. మరోవైపు అక్కడే ఉన్న టీటీడీకి చెందిన ఎలక్ట్రిషన్ రూమ్ లోనూ మరో 6 అడుగుల జెర్రిపోతు కంటపడింది. ఈ రెండు పాములను గుర్తించిన భక్తులు, దుకాణదారులు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన రెండు పాములను బంధించాడు. ఈలోపే మరో పాము భక్తుల కంటపడింది. తిరుమల సేవా సదన్ పక్కనే ఉన్న కళ్యాణ వేదిక వద్ద ఆరు ఆడుగుల నాగుపామును గుర్తించిన భక్తులు టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సేఫ్ గా ఆ పామును కూడ ఆపట్టుకున్నాడు. మూడు పాములను శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.