తెల్లవారుజామున ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ! ముగ్గురు మృతి

నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం మూడు గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదమలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా..

తెల్లవారుజామున ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ! ముగ్గురు మృతి
Allagadda Road Accident

Updated on: Aug 15, 2025 | 10:42 AM

ఆళ్లగడ్డ, ఆగస్ట్‌ 15: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శుక్రవారం (ఆగస్టు 15) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం మూడు గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదమలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు.

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు బస్సులు మార్గంమధ్యలో ఆళ్లగడ్డ వద్ద ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఢీకొన్నట్లు తెలుస్తుంది. ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సులో ఉన్న ఇద్దరు, జగన్‌ ట్రావెల్స్ బస్సులో మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్‌ సాయంతో బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంకి హుటాహుటీన 108 సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.