Vizianagaram: వామ్మో ఎంత పెద్ద పామో.. గ్రామస్తులపై ఒక్కసారిగా దూసుకొచ్చిన కొండ చిలువ.. చివరకు..

| Edited By: Basha Shek

Oct 08, 2023 | 7:30 AM

విజయనగరం జిల్లాలో కొండ చిలువలు బెంబేలెత్తిస్తున్నాయి. కొండ శివారు ప్రాంతంలోని గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత వారం రోజుల్లో జిల్లాలో మూడు చోట్ల కొండ చిలువ సంచారంతో హడలెత్తి పోయారు జిల్లావాసులు. తాజాగా విజయనగరం జిల్లా జామి మండలం తానవరం కాలనీలో ఓ పెద్ద కొండ చిలువ హల్ చల్ చేసింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో గ్రామమంతా చిమ్మ చీకట్లో ఉండగా ఓ పెద్ద కొండ చిలువ గ్రామంలోకి ప్రవేశించింది

Vizianagaram: వామ్మో ఎంత పెద్ద పామో.. గ్రామస్తులపై ఒక్కసారిగా దూసుకొచ్చిన కొండ చిలువ.. చివరకు..
15 Feet Snake
Follow us on

విజయనగరం జిల్లాలో కొండ చిలువలు బెంబేలెత్తిస్తున్నాయి. కొండ శివారు ప్రాంతంలోని గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత వారం రోజుల్లో జిల్లాలో మూడు చోట్ల కొండ చిలువ సంచారంతో హడలెత్తి పోయారు జిల్లావాసులు. తాజాగా విజయనగరం జిల్లా జామి మండలం తానవరం కాలనీలో ఓ పెద్ద కొండ చిలువ హల్ చల్ చేసింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో గ్రామమంతా చిమ్మ చీకట్లో ఉండగా ఓ పెద్ద కొండ చిలువ గ్రామంలోకి ప్రవేశించింది. అలాంటి పామును ఆ గ్రామస్తులు ఎప్పుడూ చూడలేదు. సుమారు పదిహేను అడుగుల పొడవుతో, లావుగా ఉంది. వేగంగా కదులుతూ గ్రామంలో తిరుగుతుంది. ఆ సమయంలోనే అటుగా వస్తున్న ఓ యువకుడు చీకట్లో సంచరిస్తున్న కొండచిలువ ను చూశాడు. దీంతో ఒక్కసారిగా భయపడి కేకలు వేస్తూ పరుగులు తీశాడు. ఆ కేకలు విన్న గ్రామస్తులు ఇళ్లలో నుండి బయటకు వచ్చి చూశారు. అప్పటికే పాము వేగంగా కదులుతూ చకచకా ముందుకు వెళ్తుంది. ఒంటి నిండా నల్లటి చారలతో గగుర్పాటుగా కనిపించింది. అయితే చీకట్లో ఉన్న ఆ పాము ఏంటి? దాని స్వభావం ఏంటి? అది కరిస్తే ఏమవుతుంది? అనే అంశాలు మాత్రం ఆ గ్రామస్థులకు తెలియదు. భయానకంగా ఉన్న అలాంటి పామును చూడటం అదే మొదటిసారి కావడంతో గ్రామస్తులు అంతా కొన్ని గంటల పాటు భయం భయంగా గడిపారు. అయితే కొందరు గ్రామస్తులు ముందుకు వచ్చి ఏదో ఒక విధంగా పామును చంపాలి లేకపోతే ఎవరి పై ఎలా దాడి చేస్తుందో కూడా తెలియదు? ఎవరి ప్రాణాలు పోతాయో తెలియదు? అని ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై చీకట్లోనే పామును కొట్టేందుకు నానా అవస్థలు పడ్డారు.

ఆ క్రమంలోనే ఆ పాము కూడా గ్రామంలో కలియ తిరిగింది. తరువాత గ్రామమంతా ఏకమై పామును వెంబడించి కర్రలతో దాడి చేశారు. సహజంగా కొండ చిలువ తిరగబడే స్వభావం తక్కువగా ఉంటుంది. కానీ గ్రామంలో సంచరిస్తున్న కొండ చిలువ మాత్రం ఒక దెబ్బ తగలగానే వెంటనే గ్రామస్తుల పై తిరగబడింది. అప్పటికే తిరిగి తిరిగి ఉన్న పాము గ్రామస్తుల పై ఒక్కసారిగా దూసుకు వచ్చింది. దీంతో మరోసారి గ్రామస్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. కానీ పామును అలా వదిలేస్తే ఎవరి పై దాడి చేస్తుందో? ఎవరి ఇంట్లోకి వెళ్తుందో? ఎవరికి ఏమవుతుందో అని భయపడ్డారు. ఎలాగైనా సరే చంపాల్సిందే అని యువకులు అంతా కలిసి గుంపు గా వెళ్లి పాముని చుట్టుముట్టారు. వెంటనే తమ వద్ద ఉన్న పెద్ద కర్రలతో ఒక్కసారిగా కొండ చిలువ పై విరుచుకుపడి తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం కొండ చిలువ హతమైన విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాముని పరిశీలించి చూశాడు. చనిపోయిన పాము కొండ చిలువ అని, అయితే కొండ చిలువల్లోనే అరుదైన జాతి గల పాము అని నిర్ధారించాడు. ఇలాంటి అరుదైన కొండ చిలువలు తక్కువగా ఉంటాయని, కొండ సమీప ప్రాంతం కావడంతో గ్రామంలోకి వచ్చిందని గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి పాములు ఏమైనా వస్తే తమ దృష్టికి తేవాలని, అరుదైన ప్రాణులను కాపాడుకోవడం మన భాధ్యత అని గ్రామస్తులకు తెలియజేశాడు స్నేక్ క్యాచర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..