California Mass Shooting: అమెరికా మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఓ సంస్థ ఉద్యోగుల సమావేశం జరుగుతుండగా.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది అక్కడిక్కడే ప్రాణాలను కోల్పోయారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలోని లైట్ రెయిల్ యార్డులో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. బుధవారం ఉదయం ఏడు గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. సాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే ఈ యార్డులో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని హతమార్చారు. నిందితుడిని 57 ఏళ్ల శామ్యూల్ జేమ్స్ కాసిడీగా గుర్తించారు. గత పదేళ్లుగా ఈ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ట్రాన్స్‌పోర్టేషన్ సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ట్రాన్స్‌పోర్టేషన్ సంస్థ ఉద్యోగుల సమావేశం జరుగుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడని ఓ ఉద్యోగి తల్లి చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
Read Also… Boat Accident: ఘోర ప్రమాదం.. పడవ మునిగి నలుగురు మృతి.. 156 మంది గల్లంతు.. సహాయక చర్యలు ముమ్మరం