అగ్రరాజ్యంలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.. మరోసారి ఎన్నికయ్యేందుకు బైడెన్-ట్రంప్ రెడీగా ఉంటే.. వారిద్దరూ వద్దంటున్నారు అమెరికన్లు. వచ్చేనెల 8న జరగనున్న మిడ్‌టర్మ్ ఎలక్షన్స్ అమెరికా రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికలు 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటివి. అమెరికా అధ్యక్ష పదవికి రెండో సారి పోటీ చేసేందుకు బైడెన్, ట్రంప్ ఇద్దరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న భారతీయ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి హిందీ స్లోగన్స్‌తో ప్రజల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.‘భారత్ అండ్ అమెరికా సబ్‌సే అచ్ఛే దోస్త్’ అనే స్లోగన్‌తో రెడీ అయ్యారు.
నేతలు ఇలా ప్రచారంలో బిజీగా ఉంటే.. అక్కడి ప్రజలు మాత్రం వారు కాకుండా కొత్త వ్యక్తి అధ్యక్షుడిగా రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్, ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌లపై ప్రజల్లో విశ్వసనీయత లేదనే సర్వేల్లో తేలుతుంది. 2024 అధ్యక్ష ఎన్నికలలో వీరిని మరోసారి అమెరికా ప్రెసిడెంట్‌గా చూడాలని మెజార్టీ అమెరికన్లు ఇష్టపడటం లేదు. చాలా మంది ధర్డ్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. న్యూస్ జెనరేషన్ ల్యాబ్.. యువతతో జరిపిన పోల్‌లో వీరిద్దరూ వద్దే వద్దని చెప్పారు.73 శాతం మంది బైడెన్‌కు వద్దనగా.. 43 శాతం మంది ట్రంప్ మరోసారి పోటీ చేయొద్దని కోరారు.
వీరిద్దరు వద్దంటే.. డెమోక్రాటిక్ పార్టీ తరఫున కమలా హారిస్, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ బుటెగీగ్, కాలిఫోర్నియా గవర్నర్ న్యూసోమ్‌ల పేర్లు తెరపైకి వస్తుండగా..రిపబ్లికన్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ డిసాంటిస్, మాజీ వైస్‌ప్రెసిడెంట్ మైక్ పెన్స్ పేర్లను యువత ముందుకు తెస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..