వరదలు, టోర్నడోలతో అమెరికా విలవిల!

వరదలు, పెనుగాలులతో అమెరికాలోని రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. అమెరికాలోని ఇలినాయిస్​, ఐఓవా రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. 1993 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో మిసిసిపీ నదికి వర్షపు నీరు పోటెత్తింది. ఐయోవాలోని బఫెలోలో నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఇల్లినాయిస్​ రాష్ట్రం గ్రాఫ్టన్​లో కొన్ని రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్కాన్​సస్​ […]

వరదలు, టోర్నడోలతో అమెరికా విలవిల!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 03, 2019 | 5:28 PM

వరదలు, పెనుగాలులతో అమెరికాలోని రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. అమెరికాలోని ఇలినాయిస్​, ఐఓవా రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. 1993 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో మిసిసిపీ నదికి వర్షపు నీరు పోటెత్తింది. ఐయోవాలోని బఫెలోలో నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లలోకి నీరు ప్రవేశించింది.

ఇల్లినాయిస్​ రాష్ట్రం గ్రాఫ్టన్​లో కొన్ని రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్కాన్​సస్​ రాష్ట్రంలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడో ధాటికి కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకరు గాయపడ్డారు. విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.