భలే ! పోలీసులు చూస్తుండగానే షాపుల్లో చిన్నపాటి దొంగతనాలు..! అమెరికాలో ఇదో కొత్త ‘చట్టం ‘!

| Edited By: Janardhan Veluru

Jun 15, 2021 | 9:09 PM

అమెరికాలో ఇక చిన్న చిన్న దొంగతనాలను నేరంగా పరిగణించబోరు...అంటే ఇలాంటివాటిని డీక్రిమినలైజ్ చేసేశారు. కానీ వీటికీ ఓ లిమిట్ అంటూ ఉందట.. 900 డాలర్ల కన్నా తక్కువ విలువైన వస్తువులను ఎవరైనా చోరీ చేసినా పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతారు.

భలే ! పోలీసులు  చూస్తుండగానే షాపుల్లో చిన్నపాటి దొంగతనాలు..! అమెరికాలో ఇదో కొత్త చట్టం !
Sanfrancisco Has Decriminalised Petty Theft
Follow us on

అమెరికాలో ఇక చిన్న చిన్న దొంగతనాలను నేరంగా పరిగణించబోరు…అంటే ఇలాంటివాటిని డీక్రిమినలైజ్ చేసేశారు. కానీ వీటికీ ఓ లిమిట్ అంటూ ఉందట.. 900 డాలర్ల కన్నా తక్కువ విలువైన వస్తువులను ఎవరైనా చోరీ చేసినా పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళను పట్టుకోరు.. శిక్షించబోరు….ఇంకేం ! ప్రజలకు పండగే ! శాన్ ఫ్రాన్సిస్కో లోని ఓ షాపులో చొరబడి తమకు నచ్చిన సరకులను ‘దొంగిలించుకుని’ పోతున్న వారిని మనం చూడవచ్చు.. ఓపెన్ గా చేస్తున్న ఈ చోరీలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కానీ 900 లేదా 950 డాలర్ల కన్నా ఎక్కువ విలువ చేసే వస్తువులను దొంగిలిస్తే మాత్రం… అది నేరమే అవుతుంది. ఇప్పుడు ఈ చట్టం ఎలా తెచ్చారో గానీ షాపుల యజమానులు మాత్రం లబోదిబో మంటున్నారు. ఒక్కసారిగా అయిదారుగురో లేదా అంతకంటే ఎక్కువమందో తమ స్టోర్స్ లోకి చొరబడి ఇలా చేస్తే క్షణాల్లో తమ షాపులు ఖాళీ అయిపోతాయని వారు వాపోతున్నారు.

అయినా ఈ అగ్ర రాజ్యంలో ఇంకా గన్ కల్చర్ రాజ్యమేలుతోంది. చిన్న పిల్లలు కూడా గన్స్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇంచుమించు దేశంలో ఎక్కడో ఒక చోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పబ్ లు, రెస్టారెంట్లే కాదు.. చివరకు స్కూళ్ళల్లోనూ ఈ విధమైన ఘటనలు జరుగుతున్నాయి. ఈ గన్ కల్చర్ కి అడ్డుకట్ట వేయడానికి బదులు ఇలాంటి అర్థరహితమైన డీక్రిమినలైజ్ తాయిలాలేమిటో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.

 Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.

యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.