AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాట నిలబెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. పాత చట్టాల్లోని నష్టదాయకమైన విధానాలను రద్దు చేస్తూ..

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారత ఐటీ నిపుణులకు మేలు చేసే నూతన వలస విధానానికి బైడెన్‌ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన..

మాట నిలబెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. పాత చట్టాల్లోని నష్టదాయకమైన విధానాలను రద్దు చేస్తూ..
Joe Biden
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 10:08 PM

Share

President Joe Biden signed : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న భారత ఐటీ నిపుణులకు మేలు చేసే నూతన వలస విధానానికి బైడెన్‌ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన మూడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై బైడెన్‌ సంతకం చేశారు. చట్టపరమైన వలసదారులకు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీసుకొచ్చిన విధానాలను సమీక్షించిన బైడెన్‌ పాత చట్టాల్లోని నష్టదాయకమైన విధానాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

అమెరికా సరిహద్దుల దగ్గర కుటుంబాలకు దూరమైన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటుచేయనున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ హయాంలో తమ పిల్లలను దూరం చేసుకున్న దాదాపు 5500 కుటుంబాలకు వారి పిల్లలను చేరువచేసే దిశలో ఈ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుంది.

రెండో ఉత్తర్వు ప్రకారం సరిహద్దుల ద్వారా వలస వచ్చే వారికి ఆశ్రయం కల్పించే విధానం రూపొందించడం సహా వలసల నిరోధక చర్యలను నిలిపివేయనున్నారు. ఈ ఉత్తర్వు ప్రధానంగా మెక్సికో నుంచి వలస వచ్చేవారికి లబ్ధి చేకూర్చనుంది. మూడో ఉత్తర్వు ప్రకారం గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వలసల విధానాలను సమీక్షించి సురక్షితమైన పారదర్శక వలస విధానాన్ని రూపొందించాలని బైడెన్‌ ఆదేశించారు. ఈ ఉత్తర్వులు అమెరికాలో వలస విధానాన్ని మరింత పటిష్ఠం చేయడమే కాకుండా మానవత్వంతో కూడిన వలస విధానానికి నాంది పలుకుతుందని బైడెన్‌ వ్యాఖ్యానించారు.